Thursday, May 21, 11:10
34.2 C
Hyderabad

BIG Breaking :  పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం సంచలన ప్రకటన!

పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగనున్నాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రకటనపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి అవ్వగానే పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 25 నుండి రూ. 28 వరకు పెరుగుతాయి అంటూ వస్తున్న వార్తల్లో అస్సలు నిజం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ, దేశంలో చమురు ధరలను పెంచే ప్రతిపాదన ప్రస్తుతానికి ఏదీ లేదని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ క్లారిటీ ఇచ్చారు. ఇంధన ధరల మార్పుపై ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్లాన్ లేదు. కాబట్టి ప్రజలు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు.  

గ్యాస్ (LPG), పెట్రోల్, డీజిల్ నిల్వలు మన దగ్గర పుష్కలంగా ఉన్నాయని,  సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం ముందే జాగ్రత్తలు తీసుకుందని ఆమె చెప్పుకొచ్చారు. వంట గ్యాస్ (LPG) వాడుకునే గృహిణులకు, పైపుల ద్వారా వచ్చే గ్యాస్ (PNG) వినియోగదారులకు 100% సరఫరా ఉండేలా చూస్తున్నామని ప్రభుత్వం ధీమా ఇచ్చింది.

యుద్ధం వల్ల దిగుమతులకు కొంచెం ఇబ్బంది కలిగినా, దాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా మేనేజ్ చేస్తోంది. ముఖ్యంగా ఆసుపత్రులు, విద్యా సంస్థలకు అవసరమైన కమర్షియల్ గ్యాస్ సరఫరాను ఇప్పటికే 70 శాతం పునరుద్ధరించారు. అలాగే ఫార్మా, స్టీల్ వంటి ముఖ్యమైన పరిశ్రమలకు కూడా ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు.