Thursday, May 21, 11:10
34.2 C
Hyderabad

Instagram Privacy Update: మీ సీక్రెట్స్, ‘పర్సనల్’ చాటింగ్ మొత్తం అవుట్.? ఇన్‌స్టాగ్రామ్ సంచలన నిర్ణయం!

Instagram Privacy Update
Instagram Privacy Update

Instagram Privacy Update: “అయ్యో..! ఇక నుంచి నా లవ్ చాట్స్ అన్నీ మార్క్ జుకర్‌బర్గ్ కూర్చొని చదివేస్తాడా?” అస్సలు భయపడాల్సిన పనే లేదు. మీరు పంపే ప్రతి DMని ఇన్‌స్టాగ్రామ్ వాళ్లు టైమ్ పాస్ కోసం ఓపెన్ చేసి చదవరు. కానీ కంపెనీ చెప్పేది ఏమిటంటే.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ తెస్తున్న ఒక అప్‌డేట్   అకౌంట్ల సెక్యూరిటీ పెంచడానికి, మోసాలు లేదా అక్రమ పనులు గుర్తించడానికి ఉపయోగపడతాయట. కానీ మాకు ప్రైవసీ చాలా ఇంపార్టెంట్ అనుకునే వాళ్లకు మాత్రమే ఇది గట్టి దెబ్బె.. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్ “మేము మీ మెసేజ్‌లు చూడం” అని చెప్పినా.. అవసరం అయితే చూసే టెక్నికల్ అవకాశం మాత్రం ఇప్పుడు వాళ్ల దగ్గర ఉంటుంది. అసలు టెన్షన్ అక్కడే మొదలవుతోంది! అసలు మ్యాటర్ ఏంటంటే..?

ఇన్‌స్టాగ్రామ్ ఈ రోజు (మే 8) నుంచి సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. తమ డైరెక్ట్ మెసేజ్‌లలో (DMs) ఉన్న ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను మే 8, 2026 నుంచి తొలగిస్తోంది. ఈ ఫీచర్‌ను Meta 2023లో అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు దీన్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఇప్పటి వరకు ఎన్‌క్రిప్షన్ ఆన్ చేసిన చాట్స్‌ను Meta కూడా చూడలేకపోయేది. కానీ ఈ మార్పు తర్వాత ఇన్‌స్టాగ్రామ్ లో పంపే ప్రతి మెసేజ్‌ను Meta టెక్నికల్‌గా చూడగలదు. అందుకే ప్రైవసీ గురించి ఆలోచించే యూజర్లు తమ పాత ఎన్‌క్రిప్టెడ్ చాట్స్‌ను వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

Also Read: మోదీ, అమిత్ షాలకు దిమ్మతిరిగే షాక్.. NDAకు AIADMK వెన్నుపోటు!

Meta ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది?

Meta చెప్పిన ప్రకారం Instagramలో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉపయోగించిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉందట. చాలా మంది ఈ ఫీచర్‌ను ఆన్ చేయకపోవడంతో దీన్ని కొనసాగించడం అవసరం లేదని కంపెనీ భావించింది.

అసలు ఈ ఫీచర్ Instagramలో డిఫాల్ట్‌గా ఉండేది కాదు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రత్యేకంగా ఆన్ చేయాలి. చాలా ప్రాంతాల్లో ఈ ఫీచర్ అందుబాటులో కూడా లేదు. అందుకే చాలా మంది దీనిని ఉపయోగించలేదని ప్రైవసీ నిపుణులు చెబుతున్నారు.

Also Read: ప్లీజ్.. ప్లీజ్ ఒక్కసారి.. నడిరోడ్డుపై MLAపై చేయి వేసి..!

Meta మాత్రం ప్రైవేట్ చాటింగ్ కోసం యూజర్లను వాట్సాప్ వైపు మళ్లిస్తోంది. ఎందుకంటే WhatsAppలో ఇప్పటికీ అన్ని మెసేజ్‌లు డిఫాల్ట్‌గా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తోనే పనిచేస్తున్నాయి.

ఈ మార్పు వెనుక ఇంకేమైనా కారణాలున్నాయా?

ఈ నిర్ణయం తీసుకున్న సమయం కూడా ఇప్పుడు చర్చకు దారితీసింది. అమెరికాలో మే 19, 2026 నుంచి “Take It Down Act” అనే కొత్త చట్టం అమల్లోకి రానుంది. ఈ చట్టం ప్రకారం సోషల్ మీడియా కంపెనీలు అనుమతి లేకుండా షేర్ చేసిన వ్యక్తిగత ఫోటోలు, AIతో తయారైన ఫేక్ చిత్రాలు వంటి కంటెంట్‌ను 48 గంటల్లో తొలగించాలి.

Also Read: ‘సిటాడెల్ 2’ నుంచి ‘డెకాయిట్‌’ వరకు.. వీకెండ్‌కి అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్!

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటే ప్లాట్‌ఫామ్‌కు మెసేజ్‌లలో ఏముందో కనిపించదు. అందువల్ల ఇలాంటి కంటెంట్‌ను గుర్తించడం కష్టమవుతుంది. Meta ఈ చట్టంతో తమ నిర్ణయానికి సంబంధం లేదని చెప్పినా, ఈ రెండు సంఘటనల మధ్య సమయం దగ్గరగా ఉండటం అనుమానాలకు కారణమైంది. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా, బ్రిటన్, యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాల ప్రభుత్వాలు సోషల్ మీడియా కంపెనీలపై ఒత్తిడి తెస్తున్నాయి.

వారి అభిప్రాయం ప్రకారం పూర్తి ఎన్‌క్రిప్షన్ ఉండటం వల్ల నేరాలకు సంబంధించిన సమాచారం గుర్తించడం కష్టమవుతుంది. ముఖ్యంగా చిన్నారుల భద్రతకు సంబంధించిన కేసుల్లో సమస్యలు వస్తున్నాయని వారు చెబుతున్నారు. Instagramలో యువత ఎక్కువగా ఉండటంతో ఈ ఒత్తిడి మరింత పెరిగింది. అదే సమయంలో WhatsAppపై ఇలాంటి చర్య తీసుకోవడం Metaకి కష్టమవుతుంది. ఎందుకంటే WhatsApp ప్రైవసీకి ప్రసిద్ధి పొందింది. మే 8 తర్వాత Instagramలోని అన్ని DMs సాధారణ మెసేజ్‌ల మాదిరిగానే పనిచేస్తాయి. అంటే Meta అవసరమైతే ఆ మెసేజ్‌లను యాక్సెస్ చేయగలదు.

Also Read: సెల్ఫ్ ఎన్యుమరేషన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన తెలంగాణ డీజీపీ!

దీనివల్ల కంపెనీకి కొన్ని కొత్త అవకాశాలు కూడా వస్తాయి:

  • మెసేజ్‌లలోని సమాచారాన్ని స్కాన్ చేయడం
  • చట్టపరమైన విచారణలకు మెసేజ్ డేటా ఇవ్వడం
  • ప్రకటనల కోసం డేటా ఉపయోగించడం
  • AI ట్రైనింగ్ కోసం సమాచారాన్ని ఉపయోగించే అవకాశం

Meta ప్రస్తుతం ఇవన్నీ చేస్తామని అధికారికంగా చెప్పలేదు. కానీ ఈ అవకాశం మాత్రం ఇప్పుడు కంపెనీకి అందుబాటులో ఉంటుంది.

యూజర్లు ఇప్పుడు ఏమి చేయాలి? Instagram End to End Encryption Feature

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఆన్ చేసిన యూజర్లకు Instagram యాప్‌లో చాట్ డౌన్‌లోడ్ చేసే ఆప్షన్ చూపిస్తుంది. కొంతమందికి ఈ ఫీచర్ కనిపించాలంటే యాప్‌ను అప్‌డేట్ చేయాల్సి రావచ్చు. అందుకే ఆలస్యం చేయకుండా వెంటనే యాప్‌ను అప్‌డేట్ చేసి అవసరమైన చాట్స్, ఫోటోలు, వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది. మీకు ప్రైవసీ చాలా ముఖ్యం అయితే Instagram కన్నా ఇతర యాప్స్ ఉపయోగించడం మంచిది. వాట్సాప్ లో అన్ని మెసేజ్‌లు, కాల్స్ డిఫాల్ట్‌గా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో ఉంటాయి. అలాగే సిగ్నల్ ప్రస్తుతం అత్యంత సురక్షితమైన మెసేజింగ్ యాప్‌లలో ఒకటి. ఇది ఓపెన్ సోర్స్‌గా పనిచేస్తుంది, యూజర్ ప్రైవసీపై ఎక్కువ దృష్టి పెడుతుంది.

Instagram ఇప్పటికీ ఫ్రెండ్స్‌తో చాట్ చేయడానికి ఈజీ ప్లాట్‌ఫామ్‌గానే ఉంటుంది. కానీ ఇకపై అది పూర్తిగా ప్రైవేట్ మెసేజింగ్ యాప్ కాదు. మీ వ్యక్తిగత చాట్స్ రహస్యంగా ఉండాలని భావిస్తే, ఎన్‌క్రిప్షన్ ఉన్న ఇతర యాప్‌లకు మారడం మంచిది.