Thursday, May 21, 11:11
34.2 C
Hyderabad

Work From Home: ఇండియాలో చమురు సంక్షోభం…ఇక వారికి మళ్లీ వర్క్‌ ఫ్రం హోం..?

Work From Home
Work From Home

Work From Home : గల్ఫ్‌ దేశాల్లో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సంక్షోభాన్ని అధిగమించేందుకు ఐటీ రంగం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇంధన పొదుపును ప్రోత్సహించేందుకు ‘వర్క్‌ ఫ్రం హోం’(work from home in india) (డబ్ల్యూఎఫ్‌హెచ్‌) విధానాన్ని ఎంచుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు ఐటీ పరిశ్రమ నుండి సానుకూల స్పందన లభించింది. పెట్రోల్‌, డీజిల్‌ వినియోగాన్ని తగ్గించడం, ఉద్యోగుల రాకపోకలను నియంత్రించడమే లక్ష్యంగా హైబ్రిడ్‌, రిమోట్‌ వర్క్‌ విధానాలను విస్త్రృతం చేస్తున్నట్లు ఐటీ కంపెనీల జాతీయ ప్రతినిధి సంస్థ ‘నాస్కామ్‌’ (NASSCOM) తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించింది.

Also Read :  నేడు తమిళనాడు శాసనసభ స్పీకర్ ఎన్నిక… టీవీకేకు మద్దతు ఇవ్వనున్న అన్నాడీఎంకే అసమ్మతి వర్గం?

Oil Crisis In India – Work From Home

పరిస్థితులను సమీక్షిస్తూ కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపిన నాస్కామ్‌, ఇప్పటికే కంపెనీలు తమ క్యాంపస్‌లలో విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించే చర్యలు చేపట్టాయని పేర్కొంది. హైదరాబాద్‌, బెంగళూరు, పుణే, చెన్నై, గురుగ్రామ్‌ వంటి ప్రధాన ఐటీ హబ్‌(it-companies) లలో లక్షలాది మంది ఉద్యోగులు రోజువారీ ప్రయాణాలకు వ్యక్తిగత వాహనాలను వాడుతుండటంతో భారీగా ఇంధనం ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో రిమోట్‌ లేదా హైబ్రిడ్‌ పని విధానాల ద్వారా ఉద్యోగుల ప్రయాణాలను తగ్గించి, తద్వారా దేశీయ ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని భావిస్తున్నారు. అంతకుముందు హైదరాబాద్‌ వేదికగా జరిగిన ఒక సభలో ప్రధాని మోదీ(prime-minister-modi) మాట్లాడుతూ.. మెట్రో సేవలు, కార్‌ పూలింగ్, ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకంతో పాటు కొవిడ్‌ కాలంలో అలవాటైన వర్చువల్‌ మీటింగులను మళ్లీ విస్తృతంగా అమలు చేయాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు.

గత ఏడాది కాలంగా ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు మళ్లీ పాత రోజులను గుర్తుచేస్తున్నాయి. ఒకవేళ హోర్మూజ్‌ జలసంధి సంక్షోభం మరింత ముదిరితే, కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ఐటీ రంగానికి వర్క్‌ ఫ్రం హోంను తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. చమురు ధరలు దశలవారీగా పెరిగే సూచనలు కనిపిస్తుండటంతో, భారీ క్యాంపస్‌ల నిర్వహణ వ్యయం, డీజిల్ జనరేటర్ల ఖర్చులు, ఉద్యోగుల రవాణా చార్జీల భారాన్ని తగ్గించుకోవడానికి కంపెనీలు సైతం పూర్తి స్థాయి ఇంటి వద్ద నుండి పని కాకుండా కనీసం ‘హైబ్రిడ్ విధానాని’కైనా మొగ్గు చూపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

మరోవైపు, అవకాశం ఉన్న అన్ని విభాగాల్లోనూ వర్క్‌ ఫ్రం హోంను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే అధికారిక మార్గదర్శకాలు (అడ్వైజరీ) జారీ చేయాలని ఐటీ ఉద్యోగుల సంఘమైన ‘నాసెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయీస్‌ సెనేట్‌’ (NITES) డిమాండ్ చేసింది. దీనిపై ఎన్‌ఐటీఈఎస్‌ అధ్యక్షుడు హర్పీత్‌ సింగ్‌ సలూజా స్పందిస్తూ.. ప్రతిరోజూ లక్షలాది మంది ఐటీ ఉద్యోగుల ప్రయాణాలు తగ్గడం వల్ల దేశానికి భారీ స్థాయిలో ఇంధన పొదుపు సాధ్యమవుతుందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు. – iran us war cease fire

Also Read :  మహిళలకు ఫ్రీ బస్సు.. జూన్ 1 నుంచి అమలు