Thursday, May 21, 11:11
34.2 C
Hyderabad

China Gaokao Exam System: చైనాలో ‘నో’ పేపర్‌ లీక్స్.. 1.3 కోట్ల మందికి ఒకేసారి పరీక్ష.. ఎలా సాధ్యమో తెలుసా

China Gaokao Exam System
China Gaokao Exam System

China Gaokao Exam System: భారత్‌లో దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు రాసిన నీట్-యూజీ పరీక్షా పత్రం లీకై కలకలం రేపింది. ఇప్పటికే మే 3న నిర్వహించిన నీట్ పరీక్షను ‘జాతీయ పరీక్ష సంస్థ’ (NTA) రద్దు చేసింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో పొరుగు దేశం చైనాలోని ‘గౌకావో’ పరీక్షా విధానం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. దాదాపు 1.3 కోట్ల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాస్తారు. ఇలాంటి జాతీయ స్థాయి కళాశాల ప్రవేశ పరీక్షలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అక్కడి ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటుంది. ప్రశ్నపత్రాల లీక్‌ను అడ్డుకునేందుకు చైనా పాటిస్తున్న ఈ వ్యూహాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆ దేశం పరీక్షకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తుందో అర్థం అవుతోంది. 

Also Read: హైకమాండ్ నిర్ణయంపై కేసీ వేణుగోపాల్ సంచలన కామెంట్స్

గౌకావో క్వశ్చన్ పేపర్‌ను చైనా సర్కార్‌ ‘జాతీయ రహస్య పత్రాలు’గానే పరిగణిస్తుంది. వీటి ముద్రణ ప్రక్రియ అత్యంత రహస్యంగా చేస్తారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే జైళ్లలో ఇది జరుగుతుంది. అందులో ఉండే ఖైదీలకు బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. అందుకే ఎలాంటి సమాచారం బయటకు పొయే ఛాన్స్ ఉండదని వారు భావిస్తారు. ఇక ముద్రించిన పశ్నాపత్రాలను పోలీసు భద్రతతో, GPS ట్రాకింగ్, నిరంతర వీడియో నిఘా మధ్య పరీక్షా కేంద్రాలకు పంపిస్తారు. రవాణా సమయంలో కూడా పలు పకడ్బందీగా భద్రత ఉంటుంది. భద్రతా సిబ్బంది ప్రతిది పర్యవేక్షిస్తారు. 

Also Read: దొంగలకు సాలరీ, ఇన్సెంటీవ్స్.. కరీంనగర్ దోపిడీ కేసులో పోలీసుల షాకింగ్ నిజాలు!

ఇక పరీక్ష జరిగే రోజుల్లో పరీక్షా కేంద్రాల వద్ద మెటల్ డిటెక్టర్లు, ఇంటెలిజెంట్ సెక్యూరిటీ గేట్లు, స్మార్ట్ వాచ్‌లు, మొబైల్ సిగ్నళ్లను గుర్తించే అడ్వాన్స్‌డ్‌ పరికరాలను ఏర్పాటు చేస్తారు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా డ్రోన్లు, కృత్రిమ మేధ (AI) సాయంతో నిరంతర నిఘా ఉంటుంది. అంతేకాదు పరీక్షలకు ఆటంకం, అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కొన్నిచోట్ల విమానాల దారిని కూడా మళ్లిస్తారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడం లాంటి కఠినమైన రూల్స్ అమలు చేస్తారు.

Also Read: చెక్కరపై నిషేధం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. కారణం ఇదే?

చైనా సర్కార్‌ కేవలం భద్రతకే కాకుండా.. పరీక్షకు ముందే సోషల్ మీడియాలో వచ్చే రూమర్లు, ఫేక్ ఆన్సర్ స్కామ్‌లు, వ్యవస్థీకృత చీటింగ్ నెట్‌వర్క్‌లను బట్టబయలు చేస్తుంది. ఎవరైనా క్వశ్చన్ పేపర్ లీక్ చేసినా లేదా పరీక్షలో అక్రమాలకు పాల్పడ్డా అక్కడి చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయి. అందుకే చైనాలో ఇంతటి జాతీయ స్థాయి భద్రతా ప్రోటోకాల్, సాంకేతిక నిఘా, కఠిన చట్టాల వల్లే ప్రశ్నపత్రం లీక్ కావడం అనేది దాదాపు అసాధ్యం. 

Also Read: పశ్చిమాసియా సంక్షోభం..పొదుపు మంత్రం జపిస్తున్న ప్రపంచం..ఏం చేస్తున్నాయో తెలుసా?