Thursday, May 21, 11:11
34.2 C
Hyderabad

CM Vijay Salary Hike: సీఎం విజయ్ మరో సంచలనం.. దెబ్బకు పెరిగిన జీతాలు.. 16 లక్షల మందికి గుడ్ న్యూస్!

CM Vijay Salary Hike
CM Vijay Salary Hike

CM Vijay Salary Hike: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తళపతి విజయ్ సరికొత్త  సంచలన నిర్ణయాలతో  దూసుకుపోతున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ చెబుతూ ఆయన  కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 58 శాతం డీఏ (డియర్నెస్ అలవెన్స్ -) ను 60 శాతానికి పెంచుతూ సీఎం విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ఈ 2 శాతం అదనపు డీఏ.. 2026 జనవరి 1 నుండి వర్తిస్తుందని ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Also Read: పశ్చిమాసియా సంక్షోభం..పొదుపు మంత్రం జపిస్తున్న ప్రపంచం..ఏం చేస్తున్నాయో తెలుసా?

విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను రూపొందిస్తోంది. ఈ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో, విజయవంతం చేయడంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 1, 2026 నుండి డీఏను 60 శాతానికి పెంచిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతో సీఎం విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఒక ప్రకటనలో తెలిపింది. 

Also Read: చెక్కరపై నిషేధం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. కారణం ఇదే?

1,230 కోట్ల రూపాయల అదనపు భారం

ఈ జీతాల పెంపు వల్ల తమిళనాడులోని దాదాపు 16 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నేరుగా లబ్ధి పొందనున్నారు. దీంతో తమిళనాడు ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి 1,230 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. అయినప్పటికీ, ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా ఈ అదనపు నిధులను కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది.