Thursday, May 21, 11:11
34.2 C
Hyderabad

Trump Xi Taiwan Warning: తైవాన్ విషయంలో జోక్యం చేసుకోవద్దు.. ట్రంప్‌కు జిన్‌పింగ్ ‘వార్నింగ్’..

Trump Xi Taiwan Warning
Trump Xi Taiwan Warning

Trump Xi Taiwan Warning: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా చైనాలో పర్యటిస్తున్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా బీజింగ్ చేరుకున్న ట్రంప్‌కు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఘనంగా స్వాగతం పలికారు. తొలిరోజు సమావేశంలోనే ఇరువురు నేతల మధ్య తైవాన్ అంశంపై వాడీవేడిగా చర్చలు జరిగినట్లు సమాచారం. తైవాన్ అంశంలో అమెరికా పాటిస్తున్న వైఖరిపై జిన్‌పింగ్ గట్టిగానే స్పందించారు. తైవాన్ వ్యవహారంలో అమెరికా అనవసరంగా జోక్యం చేసుకోకూడదని సూచించారు. ఒకవేళ జోక్యం చేసుకుంటే ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య నేరుగా ఘర్షణ లేదా యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని జిన్‌పింగ్ వార్నింగ్ ఇచ్చినట్లు చైనా మీడియా కథనాలు వెల్లడించాయి. 

Also Read: పశ్చిమాసియా సంక్షోభం..పొదుపు మంత్రం జపిస్తున్న ప్రపంచం..ఏం చేస్తున్నాయో తెలుసా?

తైవాన్ విషయం చైనాకు అత్యంత సున్నితమైన, కీలకమైన అంశమని జిన్‌పింగ్ తెలిపారు. దీన్ని సరైన పద్ధతిలో డీల్ చేయకుంటే ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయన్నారు.అమెరికా, చైనా ఒకరికొకరు పోటీదారులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని సూచించారు. ఇలా పరస్పర సహకారం ఉంటే ఇరుదేశాలకు ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ఈ చర్చల్లో వాణిజ్య సంబంధాలు, సెమీకండక్టర్ల తయారీ లాంటి అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: చెక్కరపై నిషేధం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. కారణం ఇదే?

ఇదిలాఉండగా తైవాన్ విషయంలో అమెరికా మాత్రం మొదటి నుంచీ వ్యూహాత్మక వైఖరి అనుసరిస్తోంది. తైవాన్ తనను తాను రక్షించుకునేందుకు ఆ దేశానికి అమెరికా రక్షణ ఆయుధాలను సరఫరా చేస్తోంది. ఇటీవల ప్రకటించిన భారీ ఆయుధాల ప్యాకేజీపై చైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు చైనా పర్యటనలో ట్రంప్‌తో పాటు ఎలోన్ మస్క్, జెన్సన్ హువాంగ్ లాంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. చైనా మార్కెట్లను అమెరికా సంస్థలకు మరింతగా తెరవాలని ట్రంప్ కోరుతున్నారు. కానీ తైవాన్ విషయంలో తన పట్టు సడలించే ప్రసక్తే లేదని చైనా తేల్చిచెప్పింది. 

Also Read: దొంగలకు సాలరీ, ఇన్సెంటీవ్స్.. కరీంనగర్ దోపిడీ కేసులో పోలీసుల షాకింగ్ నిజాలు!

ట్రంప్, జిన్‌పింగ్‌ భేటీపై ఫలితాల కోసం ప్రపంచదేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ట్రంప్ తన వ్యక్తిగత స్నేహంతో జిన్‌పింగ్‌ను వాణిజ్యపరంగా లాభం పొందాలని ప్రయత్నిస్తున్నారు. కానీ జిన్‌పింగ్ మాత్రం తైవాన్ విషయంలో ‘రెడ్ లైన్’ దాటవద్దని అమెరికాకు స్పష్టం చేశారు. ఈ పర్యటనలో ఇరుదేశాలం మధ్య కుదిరే ఒప్పందాలు భవిష్యత్తులో ప్రపంచ రాజకీయ, ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే ఛాన్స్ ఉంది.