
Nepal : నేపాల్‌లో పెద్ద ఎత్తున వరదలు వచ్చి చాలా నష్టం జరిగింది. చైనా బోర్డర్ దగ్గర ఉన్న నేపాల్ రసువా జిల్లాలో ఒక్కసారిగా భారీ వరద పోటెత్తింది. దీనివల్ల ఎనిమిది మంది చనిపోగా మరికొందరు గల్లంతయ్యారు. సరిహద్దు అవతలి వైపు ఉన్న టిబెట్‌లో కూడా ఈ వరద వల్ల చాలా ప్రాణ నష్టం జరిగింది.
నేపాల్‌లో గ్రామాలు నీటిలో కొట్టుకుపోవడంతో, సహాయం చేయడానికి ప్రభుత్వం హెలికాప్టర్లను పంపింది. టిబెట్ బోర్డర్ దగ్గర ఉన్న గ్రామాల్లో వరద ఉధృతికి రోడ్లు, వంతెనలు, కరెంట్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. రసువా జిల్లా అధికారి నరేంద్ర పరియార్ మాట్లాడుతూ.. రసువాలో వచ్చిన ఈ అకస్మాత్తుగా వచ్చిన వరద వల్ల మార్కెట్లు, ఊర్లు దెబ్బతిన్నాయని తెలిపారు. నష్టం ఎంత జరిగిందనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.
Also Read : పాక్ సంచలన నిర్ణయం.. నకిలీ నోట్లకు చెక్!
టిబెట్ వైపు నుంచి నీరు ఉప్పొంగి వచ్చి, బుధవారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో భోటేకోషి నదిలో పెద్ద ఎత్తున పడింది. నీటి మట్టం ఒక్కసారిగా పెరగడంతో కొన్ని ప్రాంతాలు చాలా దెబ్బతిన్నాయని నేపాల్ సైన్యం తెలిపింది. వరద నీటికి కార్లు, బండ్లు, సామాన్లు అన్నీ కొట్టుకుపోయాయి.
ఈ ప్రమాదం వల్ల రసువా, నువాకోట్, ధాడింగ్, చిత్వాన్, గూర్ఖా జిల్లాల్లో నదుల పక్కన ఉండే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. కస్టమ్స్ ఆఫీస్ దగ్గర ఉన్న కొన్ని బండ్లు, సామాన్లు వరదలో కొట్టుకుపోయాయని, కొత్తగా కట్టిన వంతెన కూడా కూలిపోయిందని అధికారులు చెప్పారు.
సహాయం చేసేందుకు నేపాల్ సైన్యం, పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లారు. గాలింపు చర్యల కోసం సైన్యం రెండు హెలికాప్టర్లను పంపింది. డాక్టర్ల టీమ్‌తో కూడిన మరో హెలికాప్టర్‌ను కూడా ఆస్పత్రికి తరలించారు. నష్టం ఎంత జరిగిందనే లెక్కలు ఇంకా తీస్తున్నారు. అయితే, రసువాలో ఈ వరదలు వర్షం వల్ల రాలేదని నేపాల్ వాతావరణ శాఖ చెప్పింది. సరిగ్గా ఇలాగే గత ఏడాది కూడా భోటేకోషి నదిలో పెద్ద వరద వచ్చి పది మంది చనిపోయారు. అప్పుడు ఐస్ కొండల మధ్య ఉండే సరస్సు అకస్మాత్తుగా పగిలి నీళ్లన్నీ కిందకి రావడంతో ఆ వరద వచ్చింది. ఇక రక్షణ విధుల్లో ఉన్న 33 మంది భద్రతా సిబ్బంది ఆచూకీ గల్లంతయ్యారు.
Also Read : ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వీసా అపాయింట్మెంట్లు నిలిపివేత
VIDEO | Nepal: Devastating flash flood causes major damage to markets and hydropower projects in Rasuwa region. More details are awaited.#NepalNews #NepalFlashFlood
(Source: Third Party)
(Full video available on PTI Videos – https://t.co/d8jp61yd2p) pic.twitter.com/QQmU1advuw
— Press Trust of India (@PTI_News) August 26, 2026









