Thursday, May 21, 14:28
37.7 C
Hyderabad

Dhurandhar OTT: ‘ధురంధర్’ ఫ్యాన్స్‌కు డబుల్ సర్‌ప్రైజ్.. రెండు ఓటీటీల్లో ఒకేసారి స్ట్రీమింగ్!

Dhurandhar OTT
Dhurandhar OTT

Dhurandhar: ధురంధర్: ది రివెంజ్ Dhurandhar: The Revenge ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో మంచి రెస్పాన్స్ తో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక భారత్‌లో ఈ సినిమా జియో హాట్ స్టార్ లో ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ చేసిన కొత్త ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన వివరాల ప్రకారం, మొదటి Dhurandhar సినిమాకి సంబంధించిన రా వెర్షన్‌ను మే 22, 2026 నుంచి భారత్‌లో స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నారు. ఈ వార్త విన్న వెంటనే చాలా మంది అభిమానులు ఇది రెండో భాగం గురించి అనుకున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే, ఇది మొదటి సినిమాకే సంబంధించిన స్పెషల్ అన్‌కట్ వెర్షన్.

Also Read: ‘పాలిపోయిన ముఖంతో.. బక్కచిక్కిపోయి’.. ఎన్టీఆర్ పై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్!

ఈ రా వెర్షన్‌లో సినిమాను ఎలాంటి కట్‌లు లేకుండా చూపించనున్నారు. ముఖ్యంగా బోల్డ్ డైలాగులు, యాక్షన్ సీన్స్, విజువల్స్‌ను పూర్తిగా అలాగే ఉంచినట్టు సమాచారం. ఈ వెర్షన్ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇదే రా వెర్షన్‌ను జియో హాట్ స్టార్ లో కూడా రేపటి నుంచే స్ట్రీమింగ్ చేయనుంది. అంటే మొదటి ధురంధర్ సినిమా రెండు ఓటీటీ ప్లాట్‌ఫాంలలో ఒకేసారి అందుబాటులో ఉండబోతోంది.

Also Read: అభినయ్‌ దర్శన్ ‘హత్యాయత్నం’ డ్రామా వెనుక కుట్ర కోణం..మత విద్వేషాల కోసమే పక్కా స్కెచ్

అయితే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Dhurandhar 2 విడుదల తేదీలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఈ సినిమా జూన్ 4, 2026న జియో హాట్ స్టార్ లో విడుదల కానుంది. థియేటర్లలో వచ్చిన సెన్సార్ వెర్షన్‌నే ఓటీటీలో కూడా చూపించనున్నట్టు తెలుస్తోంది.