
Nepal Correspondence : నేపాల్ లో సంభవించిన ఘోర విపత్తు కారణంగా వందలాది మంది మృత్యవాత పడ్డారు. కాగా, ఈ ప్రమాదానికి కారణం హిమలయాల్లో హిమనీ సరస్సు బద్ధలవడమేనని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే దీనికి భిన్నంగా టిబెట్ సరిహద్దుల్లో చైనా నిర్మాణ కార్యకలాపాలే రసువాలో అకస్మాత్తుగా వచ్చిన వరదలకు కారణమని నేపాల్ విలేకరుల బృందం ఆరోపిస్తోంది. ఈ మేరకు ఎక్స్‌లో ఈ ప్రమాదాన్ని ఉద్దేశపూర్వక పర్యావరణ విపత్తుగా అభివర్ణిస్తూ ఎక్స్‌లో నేపాల్ కరస్పాండెన్స్ హ్యాండిల్ వేదికగా పోస్ట్ చేయడం కలకలం రేపింది.
టిబెట్ సరిహద్దు సమీపంలో చైనా చేపడుతున్న నిర్మాణ పనులే ఆగస్టు 26, 2026న రసువాలో సంభవించిన తీవ్ర అకస్మిక వరదలకు కారణమని, అది ఒక “ఉద్దేశపూర్వక పర్యావరణ విపత్తు” అని X లోని నేపాల్ జర్నలిస్టుల కూటమి ఆరోపించడం గమనార్హం. కొండలను తొలిచి, త్రిశూలి నది సహజ ప్రవాహాన్ని మార్చి నిర్మించిన షియావోకాంగ్ (Xiaokang) నివాసాలు, గైరాంగ్ (Gyrong) పట్టణం వల్ల ఏటా హిమపాతాలు, విధ్వంసకర వరదలు నేపాల్‌ను ముంచెత్తుతున్నాయని వారు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు ఇంకా అధికారికంగా ధ్రువీకరించబడలేదు
ఈ అకస్మాత్ వరదలు పొరుగునే ఉన్న సరిహద్దు ప్రాంతంలో చైనా చేపడుతున్న నిర్మాణ కార్యకలాపాల వల్ల సంభవించిన ‘ఉద్దేశపూర్వక పర్యావరణ విపత్తు’ అని ‘X’ లోని నేపాల్ పాత్రికేయుల సోషల్ మీడియా హ్యాండిల్ నేపాల్ కరస్పాండెంట్స్ ఆరోపించింది. ఈ ‘నేపాల్ కరస్పాండెన్స్’ తమను తాము ‘సమాచారం వెనుక ఉన్న విషయాలను, దాని విశ్లేషణను అన్వేషించేందుకు ఏర్పాటైన పరిశోధనాత్మక జర్నలిజం వేదిక’గా వర్ణించుకుంది.
Also Read : అతిపెద్ద డ్యాం నిర్మిస్తున్న చైనా.. భారత్‌కు పొంచి ఉన్న మెగా ముప్పు
“హిమానీనదాల ఎత్తులో ఉన్న ప్రాంతాలలో చైనా నిర్మిస్తున్న షియావోకాంగ్ నివాసాల వల్ల పర్యావరణ విపత్తు ఏర్పడుతోంది. దీనివల్ల ప్రతి ఏటా చైనా-నేపాల్ సరిహద్దులో హిమపాతాలు వచ్చి అకస్మాత్ వరదలకు దారితీస్తున్నాయి” అని ఆ హ్యాండిల్ పోస్ట్ చేసిన థ్రెడ్ తీవ్ర ఆరోపణలు చేసింది.
“ఈనాటి వరద ఆక్రమిత టిబెట్‌లోని గైరాంగ్ పట్టణం సమీపంలో ప్రారంభమైంది. కొండలను తొలిచి ఈ పట్టణాన్ని నిర్మించారు. ఈ పట్టణాన్ని త్రిశూలి నది సహజ ప్రవాహ మార్గంలోనే నిర్మించారు. హిమానీనదాల శిఖరాలపై ఉండే సున్నితమైన పర్యావరణ వ్యవస్థకు జరిగిన నష్టం కారణంగా ఇప్పుడు ప్రతి సంవత్సరం హిమపాతాలు సంభవిస్తూ, నేపాల్‌లో అకస్మాత్ వరదలకు కారణమవుతున్నాయి. ఇది తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తోంది” అని ఆ పోస్ట్ ఆరోపించింది. “రసువా సరిహద్దులో నిర్మించిన గైరాంగ్ రేవును (పసిఫిక్/నది పోర్ట్) కూడా చైనా కావాలనే నదుల సంగమం వద్ద నిర్మించింది. ఇది నేపాల్ భూభాగం వైపు నది ప్రవాహ వేగాన్ని పెంచుతుంది. ఇది కేవలం ఉద్దేశపూర్వక పర్యావరణ విపత్తు మాత్రమే కాదు, చాలా క్రూరమైన చర్య కూడా” అని ఈ సందర్భంగా పోస్టులో సదరు జర్నలిస్టుల హ్యాండిల్ తీవ్రంగా ఆక్షేపించింది.
ఆ థ్రెడ్ ముగింపులో, “హిమాలయాలకు కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తూ, సరిహద్దు ప్రాంతమంతటా పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తున్న చైనాతో నేపాల్ ప్రధానమంత్రి (@PM_nepal_) ఈ విషయాన్ని తప్పక లేవనెత్తాలి” అని పేర్కొంది. అయితే, ఈ హ్యాండిల్ చేసిన ఆరోపణలను డౌన్ టు ఎర్త్ (Down To Earth) పత్రిక వెబ్సైట్ స్వతంత్రంగా ధ్రువీకరించలేకపోయింది.
ఆగస్టు 26 ఉదయం రసువా జిల్లాను భారీ అకస్మాత్ వరదలు ముంచెత్తాయి. భోటే కోషి, త్రిశూలి నదీ వ్యవస్థల గుండా నీరు, పూడిక, పెద్ద పెద్ద రాళ్ళు శరవేగంగా కొట్టుకురావడంతో దిగువ ప్రాంతాలపై పడే ప్రభావం పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక నివేదికల ప్రకారం, ఆగస్టు 26న స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:00 గంటల ప్రాంతంలో భోటే కోషి పరివాహక ప్రాంతంలో నీటి మట్టాలు వేగంగా పెరగడం ప్రారంభమయ్యాయి. నది గట్లను తెంచుకుని ప్రవహించిన వరద నీరు భోటే కోషి నది ద్వారా త్రిశూలి నదిలోకి ప్రవేశించింది. ఈ వరద ప్రభావం నువాకోట్, ధాడింగ్ జిల్లాల వరకు విస్తరించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : నేపాల్‌లో ఆకస్మిక వరదలకు కారణం అదేనా? టిబెట్, భారత్‌కూ ముప్పు తప్పదా?









