
Raksha Bandhan 2026 : రాఖీ పండుగ అనగానే అన్నచెల్లెళ్ల అనుబంధం గుర్తుకు వస్తుంది. అయితే ఉద్యోగాలు, పెళ్లిళ్ల నేపథ్యంలో ఎక్కడెక్కడో స్ధిరపడిన వారు ఆ రోజుకు తప్పకుండా సోదరునికి రాఖీ కట్టెందుకు చేరుకుంటారు. సాధారణంగా ఉదయం పూటనే రాఖీ కట్టాలని అందరూ అనుకుంటారు. అయితే ఒక్కోసారి అనుకున్న సమయానికి రాఖీ కట్టే అవకాశం ఉండకపోవచ్చు. దీంతో నిరాశ చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ఏదైనా కారణం వల్ల ఉదయం శుభ ముహూర్తంలో రాఖీ కట్టలేకపోయినట్లయితే, సాయంత్రం వేళల్లో కూడా పలు శుభ సమయాలు ఉన్నాయి.
అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగను ఈ రోజు, అంటే ఆగస్టు 28, శుక్రవారం నాడు ఉదయ తిథి ఆధారంగా ఘనంగా జరుపుకుంటున్నారు. సాధారణంగా ఈ రోజు ఉదయం వేళలోనే రాఖీ కట్టడానికి మంచి ముహూర్తం ఉంది, అయితే ఆ సమయానికి కట్టలేకపోయిన వారికోసం ఈ రోజున రాఖీ కట్టడానికి మరికొన్ని శుభ ముహూర్తాలు కూడా ఉన్నాయి. రాహుకాలాన్ని మినహాయిస్తే, ఈ రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వరకు రాఖీ కట్టడానికి వివిధ శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఏదైనా కారణం చేత ఉదయం వేళ రాఖీ కట్టించుకోలేని వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. సాయంత్రం రాఖీ కట్టడానికి ఉన్న శుభ ముహూర్తం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
రక్షాబంధన్ రోజున, అంటే ఈ రోజు ఆగస్టు 28న రాఖీ కట్టడానికి అత్యంత ఉత్తమమైన ముహూర్తం ఉదయం 05:57 గంటల నుండి ఉదయం 09:48 గంటల వరకు ఉంది. అయితే ప్రస్తుతం ఆ సమయం దాటిపోయింది. ఒకవేళ ఈ ముహూర్తంలో రక్షాబంధన్ వేడుకను పూర్తి చేయలేకపోయినట్లయితే, ఈ రోజు మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఉన్న శుభ ముహూర్తాలలో తప్పకుండా రాఖీ కట్టుకోవచ్చు. ఇంకా ఏయే శుభ ముహూర్తాలు ఉన్నాయో ఒకసారి చూద్ధాం
అభిజిత్ ముహూర్తం: మధ్యాహ్నం 12:14 నుండి మధ్యాహ్నం 01:05 వరకు.
గోధూళి ముహూర్తం: సాయంత్రం 06:57 నుండి సాయంత్రం 07:19 వరకు.
విజయ ముహూర్తం: సాయంత్రం 04:08 నుండి సాయంత్రం 05:03 వరకు.
అమృత కాలం: సాయంత్రం 04:14 నుండి సాయంత్రం 05:53 వరకు.
రెండవ గోధూళి ముహూర్తం: రాత్రి 08:41 నుండి రాత్రి 09:02 వరకు.
సాయాహ్న సంధ్య: రాత్రి 08:41 నుండి రాత్రి 09:43 వరకు.
Also Read : పాత బైక్లు, కార్లు ఉన్నవారికి బిగ్ అలర్ట్.. E20 పెట్రోల్ ఉంచాలా? తీసేయాలా? నిజం చెప్పేసిన బీపీసీఎల్!
రక్షాబంధన్ రాఖీ కట్టడానికి చౌఘడియా ముహూర్తాలు
శుభ చౌఘడియా ముహూర్తం: మధ్యాహ్నం 12:22 నుండి మధ్యాహ్నం 01:58 వరకు.
చర చౌఘడియా ముహూర్తం: సాయంత్రం 05:11 నుండి సాయంత్రం 06:47 వరకు.
రాహుకాలం ఎప్పటి నుండి ఎప్పటి వరకు?
రాఖీ కట్టడానికి అనేక శుభ ముహూర్తాలు ఉన్నప్పటికీ, రాహుకాలంలో పొరపాటున కూడా రాఖీ కట్టకూడదు. ఇందుకోసం రక్షాబంధన్ రోజున రాహుకాలం ఎప్పుడు ఉందో తెలుసుకోవడం ముఖ్యం. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:00 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. మత విశ్వాసాల ప్రకారం, ఈ సమయంలో ఎలాంటి శుభ లేదా మాంగళిక కార్యాలు చేయకూడదు.
సాయంత్రం రాఖీ కట్టేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
సాయంత్రం వేళ రాఖీ కడుతున్నట్లయితే కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. సాయంత్రం రాఖీ కట్టడానికి ముందు సంధ్యా దీపం తప్పకుండా వెలిగించండి. సోదరులు నల్లని దుస్తులు ధరించి రాఖీ కట్టించుకోకూడదు. చెప్పులు/షూలు వేసుకుని రాఖీ కట్టించుకోవద్దు. ఒకవేళ సోదరి ఇంటికి రాఖీ కట్టించుకోవడానికి వెళ్తే, ముందుగా కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుని, తలపై రుమాలు వేసుకున్న తర్వాతే రాఖీ కట్టించుకోవాలి.
(గమనిక: ఈ సమాచారం మత విశ్వాసాలు, ఆచారాలు,అందుబాటులో ఉన్న మతపరమైన ఆచారాలపై ఆధారపడి ఉంటుంది. వివిధ ప్రాంతాలు, సమాజాలు , సంప్రదాయాల ప్రకారం పండుగల తేదీలు, పూజా విధానాలు , విశ్వాసాలలో వ్యత్యాసాలు ఉండవచ్చు. పాఠకులు దీనిని సాధారణ మతపరమైన సమాచారంగా మాత్రమే చూడగలరు.)
Also Read : కేంద్ర మంత్రివర్గంలో భారీ ప్రక్షాళన… తెలుగు రాష్ట్రాల నుంచి వారికి ఛాన్స్..









