
MLC Mirza Rahmat Baig : తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం చెలరేగింది. ఒక పార్టీ ఎమ్మెల్సీని పార్టీ నుంచి భహిష్కరించడమే కాకుండా వెంటనే ఎమ్మెల్సీగా రాజీనామా చేయాలని ఆదేశించడం సంచలనంగా మారింది. వివరాల ప్రకారం ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్‌ను ఎంఐఎం అధిష్టానం పార్టీ నుంచి బహిష్కరించింది. అంతే కాకుండా తక్షణమే ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేయాలని కూడా ఆదేశించడం సంచలనంగా మారింది. మిర్జా రహ్మత్ బేగ్వెంటనే శాసనమండలి చైర్మన్‌కు తన రాజీనామాను సమర్పించాలని సీరియస్‌గా ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు ఏఐఎంఐఎం పార్టీ జాయింట్ సెక్రటరీ ఎస్.ఎ. హుస్సేన్ అన్వర్ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. కాగా, కారణం ఏంటని పార్టీ ఇప్పటివరకు ప్రకటించకపోయినప్పటికీ ఈ పరిణామం ఇప్పుడు పాతబస్తీలో తీవ్ర చర్చకు దారితీసింది. రహ్మత్ బేగ్‌పై పార్టీ ఇలా కఠిన చర్య తీసుకోవడానికి కారణం ఏంటనే విషయంపై స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే ఎంఐఎం మాత్రం ఇప్పటివరకు కారణాలు వెల్లడించలేదు.
Also Read : సూర్యాపేట జిల్లాలో దారుణం.. వేపచెట్టు వివాదం.. ఇద్దరి దారుణహత్య
మైనర్ బాలికపై ఎమ్మెల్సీ అత్యాచారం?
పాతబస్తీకి చెందిన మిర్జా రహ్మత్ బేగ్ పార్టీలో క్రియశీలంగా పనిచేస్తున్నారు. దీంతో ఆయనను గుర్తించిన అధిష్టానం 2023లో ఎమ్మెల్సీగా ఎన్నిక చేసింది. రహ్మత్ బేగ్ పదవీకాలం 2029 మే వరకు ఉంది. అయితే సడన్‌గా అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా ఎమ్మెల్సీ పదవికి తక్షణమే రాజీనామా చేయాలంటూ అధిష్టానం ఆదేశించడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. మిర్జా రహ్మత్ బేగ్ ఇటీవల ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడుండగా పలువురు అతన్ని పట్టుకున్నారు. అత్తాపూర్‌లో జరిగిన ఈ ఘటనలో పట్టుబడ్డ ఎమ్మెల్సీకి స్థానిక యువకుల దేహాశుద్ది చేయడంతో పాటు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో కలకలం రేగింది. ఈ విషయంలో ఎంఐఎం పై తీవ్ర విమర్శలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే పార్టీ ప్రతిష్టకు ముప్పు వాటిల్లక ముందే చర్యలకు ఉపక్రమించినట్లు ప్రచారం సాగుతోంది. అయితే మీర్జా రహ్మత్ బేగ్ పాతబస్తీలో కొంతకాలంగా అనేక అకృత్యాలకు పాల్పడుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ముందే తెలుసని అయినా చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. అయితే మైనర్ పై అత్యాచారం విషయం వెలుగు చూడడంతో రహ్మత్ బేగ్‌ను ఉమ్రాకు పంపించారనే ఆరోపణలు వినిపిస్తుండటం గమనార్హం.
కాగా ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ నేత సల్మాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. రహ్మత్ బేగ్ అకృత్యాల గురించి హైదరాబాద్ సిటీ మొత్తం తెలియాలని అతన్ని ఎంఐఎం పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించారో అసదుద్దీన్ ఒవైసీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పాతబస్తీలో జరుగుతున్న అకృత్యాల వెనుక ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌తో పాటు ఒక ఎంఐఎం ఎమ్మెల్యే, ఒక కార్పొరేటర్ కూడా ఉన్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. దానికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని కూడా ఆయన అన్నారు. అసదుద్దీన్ ఒవైసీ హిజాబ్, ఆడవారి పట్ల గౌరవంగా ఉండాలని మాట్లాడుతారు కానీ వాళ్ల నాయకులు మాత్రం ఆడవారితో అసభ్యంగా ప్రవర్తిస్తుంటారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Also Read : బంగారం, వెండి ధరలు ఢమాల్… ఈ రోజు కొన్నవారికి లక్కీ ఛాన్స్..?









