Chennai Crime :మహిళను హత్యచేసి ముక్కలు చేసి బిర్యానీ వండటంతో పాటు, మిగిలిన శరీర భాగాలను సూట్‌కేస్‌లో పెట్టి తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ రైల్లోని ఓ సూట్‌కేస్‌లో పెట్టి వదిలివెళ్లిన భార్యభర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చెన్నై నుంచి ఢిల్లీ బయల్దేరిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ రైల్లో దుర్వాసనతో కూడిన ఓ సూట్‌కేస్‌లో మనిషి శరీర భాగాలు లభించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారమై పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ దర్యాప్తులో మహిళను చెన్నై గూడువాంజేరిలో హత్య చేసి, కొన్ని శరీర భాగాలను సూట్‌కేస్‌లో ఉంచి రైల్లో వదిలిపెట్టివెళ్లినట్లు తెలిపారు. మరికొన్ని భాగాలను కుక్కర్‌లో పెట్టి ఉడికించినట్లు తెలిపారు. కాగా, ఈ హత్యకు గురైంది మహిళ అని, ఆమె పేరు హైతుల్లా నిషా(38)గా తేల్చారు. ఆమెతో పాటు కలిసి ఉంటున్న మాణిక్‌ ఉత్తిన్‌ లస్కర్, అతని భార్య భాగమతి మాజీలు కలిసి ఈ హత్య చేసినట్లు తేల్చారు.

కాగా, ఈ ఘటన తర్వాత నిందితులు ఇద్దరూ పారిపోయారు. అయితే వారి ఆచూకీ కోసం అసోం, ఒడిశా రాష్ట్రాల్లో గాలించగా చివరికి మణిపుర్‌లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లిన పోలీసులు మాణిక్‌ ఉత్తిన్‌ లస్కర్, భాగమతి మాజీలను శనివారం అరెస్టు చేసినట్లు తెలిపారు. వారిని ట్రాన్సిట్‌ వారెంట్‌పై తాంబరం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై మాణిక్‌ ఉత్తిన్‌ లస్కర్‌ను విచారించిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. మాణిక్‌ ఉత్తిన్‌ లస్కర్, భాగమతి మాజీ దంపతులు గూడువాంజేరిలో నివాసం ఉంటున్నారు. మాణిక్‌ ఉత్తిన్‌ లస్కర్ తాంబరంలో పనిచేసే సంస్థలోనే హైతుల్లా నిషా కూడా పని చేసింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. తర్వాత అతను తన ఇంటికి సమీపంలోనే ఇల్లు అద్దెకు తీసుకుని ఆమెను ఉంచాడు. చుట్టూ పక్కల వారికి తన అక్క అని చెప్పేవాడు. ఈ క్రమంలో మాటిక్ వల్ల హైతుల్లా నిషా గర్భం దాల్చింది. దీంతో తనను వివాహం చేసుకోవాలని ప్రియుడిని కోరింది. అయితే అది ఇష్టం లేని అతను అబార్షన్‌ చేయించుకోవాలని చెప్పాడు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం భాగమతి మాజీకి తెలిసింది. దీంతో కుటుంబంలో గొడవలు జరిగాయి. అనంతరం అబార్షన్‌ విషయమై హైతుల్లా నిషాతో మాణి క్‌ ఉత్తిన్‌ లస్కర్, అతని భార్య మాట్లాడారు. అయితే దానికి ఆమె ఒప్పుకోలేదు. దీంతో వారి మధ్య గొడవ తీవ్ర స్థాయిలో జరిగింది. ఆ కోపంలో భార్యాభర్తలు ఆమెను కొట్టి చంపేశారు. ఆ తర్వాత తల నరికేసి, రక్తాన్ని బిర్యానీ వండే పాత్రలో పట్టారు. కొన్ని శరీర భాగాలను అందులో ఉంచి, తలను మరోచోట పడేశారు. మిగిలన శరీర భాగాలను సూట్‌కేస్‌లో పెట్టి తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ రైల్లో వదిలేసి వెళ్లిపోయారు. ఇక బిర్యానీ పాత్రలో ఉన్న శరీర భాగాలను పడేసేందుకు యత్నించగా అప్పటికే పోలీసులకి తెలియడంతో ఇద్దరూ ఒడిశాకు పారిపోయారు. అక్కడి నుంచి మణిపుర్‌ చేరుకున్నారు. అక్కడ పోలీసులకు చిక్కారు. కాగా తల ఎక్కడ పడేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.