
BRS protests :తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణం వద్ద తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీకి రావడానికి ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడం, మహిళ ఎమ్మెల్యేల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ సభ్యులను అసెంబ్లీకి రాకుండా ప్రభుత్వం అడ్డుకుందని ఆ పార్టీ నేతలు తీవ్రంగా విమర్శించారు. దీనిపై ఎక్కిడకక్కడ నిరసనలు తెలపాలని నేతలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.
అసెంబ్లీ ముందు కంటతడి పెట్టుకున్న మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
నలుపు రంగు చీర ధరించి అసెంబ్లీకి వెళ్తున్న సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించిన పోలీసులు
కౌరవ సభలా మారిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు https://t.co/0Nua3mziEr pic.twitter.com/Ada7X5MXwj
— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026
కాగా ఈ రోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవ్వగా అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. నినాదాలు రాసి ఉన్న నల్ల టీషర్టులతో బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించడాన్ని పోలీసులు అడ్గుకున్నారు. పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో టీషర్టులు విప్పి హరీశ్‌రావు, పలువురు ఎమ్మెల్యేలు బనియన్లతో అక్కడే నిరసన తెలిపారు. ఈ సందర్భంగాబీఆర్ఎస్ నేతలు.. పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా.. తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ మహిళా నేతలపై పోలీసులు ప్రవర్తించిన తీరు తీవ్ర చర్చకు దారి తీసింది. పోలీసులు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జుట్టుపట్టుకుని నెట్టడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే మరో మహిళా నేత సునీత లక్ష్మారెడ్డి చీర లాగడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ విషయమై కేటీఆర్, హరీష్ రావు ఫైర్ అయ్యారు. మరోవైపు ఈ విషయమై సోషల్ మీడియాలో రచరచ్చ సాగుతోంది. ఇలాంటి నేతలకా అధికారం కట్టబెట్టామంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మహిళా నేతలపై ఇదేం పోలీస్ జులుం అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. సబితా ఇంద్రారెడ్డిని జుట్టుపట్టుకుని ఓ పోలీస్ నెడుతున్న వీడియోను హరీష్ రావు ఎక్స్ లో షేర్ చేశారు.. తెలంగాణ అసెంబ్లీ చరిత్రలోనే ఈ రోజు బ్లాక్ డే అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజాపాలనను అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నామని, తమపట్ల అంత కర్కశంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు ఏమయ్యాయని అసెంబ్లీలో నిలదీసేందుకు నిరసనగా వెళ్తుంటే.. కావాలని అడ్డుకున్నారని ఆయన దుయ్యబట్టారు.
హరీష్ రావుని, జగదీష్ రెడ్డిని కింద నెట్టివేయడంతో ఆగ్రహానికి గురై పోలీసులపై విరుచుకుపడ్డ కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు https://t.co/iLd26HGdHM pic.twitter.com/PWHqVGHPAa
— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026
ఇది శాసనసభ నా.. లేక కౌరవ సభ నా? : మాజీమంత్రి హరీష్ రావు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ వద్ద మహిళా శాసన సభ్యురాలి చీర లాగడం, మరో మహిళా నేత జుట్టుపట్టి నెట్టడంపై మాజీ మంత్రి, బిఆర్ఎస్ శాసనసభా పక్షం ఉప నేత హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది శాసనసభ నా.. లేక కౌరవ సభ నా? అంటూ ప్రశ్నించారు. మహిళా నేతల చీరలు లాగడం, ప్రజా ప్రతినిధులపై పోలీసులను ప్రయోగించడం, ఎమ్మెల్యేలను మెడపట్టి గెంటేయడమేనా ప్రజా పాలన అంటే ? అంటూ ఆయన నిలదీశారు. ప్రజా సమస్యలపై సభలో చర్చిద్దామంటే ప్రభుత్వం ఎందుకు పారిపోతోంది? ఇదేం రాజ్యం రేవంత్ రెడ్డీ ? పోలీస్ రాజ్యమా? అని ఆయన దుయ్యబట్టారు.
పోలీసులు సభ్యుల పట్ల అమానుషంగా, అమానవీయంగా ప్రవర్తించారు. మా మహిళా సభ్యుల చీరెలు లాగిన పోలీసులను వదిలిపెట్టం అని హరీష్ రావు తీవ్రంగా హెచ్చరించారు. సునీతమ్మ చీర లాగిన పోలీసులను, సబితమ్మ గొంతు నొక్కిన పోలీసులను, జగదీష్ రెడ్డిని కింద పడేసి తొక్కిన వారినైనా సరే.. సప్త సముద్రాల ఆవల ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు తీరుతో కేటీఆర్ కి చేయి, ముఖం మీద గీరుకు పోయిందన్నారు. యాదవ రెడ్డికి కుడి కాలు గోరు ఊడి పోయింది, రాజశేఖ రెడ్డి కాలు కమిలి పోయింది, సంజయ్ చేతికి దెబ్బ తగిలిందని హరీష్ రావు తెలిపారు. వారిని కనీసం ఆస్పత్రికి కూడా తీసుకెళ్లకుండా అడ్డుకోవడంపై హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. హోం మంత్రి, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇందుకు తగిన మూల్యం తప్పించుకోక తప్పదని హెచ్చరించారు. బీజేపీ, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సంగ్ చేసుకొని 22ఎ మీద, ఫీజు రియంబర్స్మెంట్ మీద నామమాత్రపు చర్చ చేస్తారా? ప్రధాన ప్రతిపక్షం లేకుండా చర్చలు చేయడం వెనుక ఆంతర్యమేమిటని హరీష్ రావు తీవ్రంగా ఆక్షేపించారు.









