Ukraine-Russia War : రష్యాతో ఉక్రెయిన్‌- సాగిస్తున్న యుద్ధం నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకుంటూనే ఉన్నాయి. ఓటమిని అంగీకరించడానికి ఇరు దేశాలు సుముఖంగా లేకపోవడంతో రెండు దేశాలు పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాయి. ఉక్రెయిన్‌ పై రష్యా సైనిక చర్య మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌ అమెరికా, ఐరోపా దేశాల నుంచి సహాయం కోరుతూనే ఉంది. ఆ దేశాలు ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తున్నప్పటికీ ఆ సాయం యుద్ధ ఖర్చులకే సరిపోతున్నాయి. దీంతో దేశం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటుంది. ఈ తరుణంలో ఉక్రెయిన్‌ సొంతంగా నిధులు సమకూర్చుకునేందుకు సిద్ధమైంది. దీనికోసం ఒక పోర్నోగ్రఫీ ప్రతిపాదనను చట్టబద్ధం చేయాలని యోచిస్తోందన్న వార్తలు సంచలనంగా మారాయి. ఈ అంశానికి సంబంధించి అంతర్జాతీయ మీడియా ఒక కథనం వెలువరించడం గమనార్హం.

ఉక్రెయిన్‌ లో పోర్నోగ్రఫీ ని చట్టబద్ధం చేయాలంటూ ఆ దేశ చట్టసభ్యుడు యారోస్లావ్ బిల్లును తీసుకువచ్చాడు. అడల్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీని చట్టబద్ధం చేయడం వల్ల.. దాని మీద వేసే పన్నులతో ప్రభుత్వానికి 25 మిలియన్ డాలర్ల వరకు ఆదాయం వస్తుందని ఆయన ప్రతిపాదించారు. ఆ నిధులతో 30వేల డ్రోన్లను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందని వాదిస్తున్నారు. నిజానికి పోర్నోగ్రఫీని సృష్టించడం, పంపిణీ చేయడం, అశ్లీల వీడియోలను కలిగి ఉండటం ఉక్రెయిన్‌లో చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. ఈ విషయంలో కేసుల తీవ్రతను బట్టి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆ దేశంలో చాటుమాటుగా అడల్ట్ ఇండస్ట్రీ విస్తరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా తీసుకొచ్చిన ప్రతిపాదన అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది.

అయితే, ఉక్రెయిన్‌ లో పోర్నోగ్రఫీ చట్టవిరుద్ధమే అయినప్పటికీ.. కొద్దిరోజులుగా అడల్డ్ కంటెంట్ ను సృష్టిస్తున్నక్రియేటర్ల నుంచి ఉక్రెయిన్‌ అధికారులు పన్నులు వసూలు చేయడం గమనార్హం. అయితే ఆ క్రియేటర్లకు ఒక విచిత్ర పరిస్థితి ఎదురవుతోందని యారోస్లావ్ అంటున్నారు. అదేంటంటే ఆ పన్ను చెల్లించకపోతే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ చెల్లించి అశ్లీల కంటెంట్ ను క్రియేట్‌ చేస్తే చట్టాల ఉల్లంఘన కింద నేరం ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. అందుకే, పోర్నోగ్రఫీని చట్టబద్ధం చేసి.. దాని ద్వారా ఆదాయం పొందేలా చట్టం తీసుకురావాలని ఆ చట్టసభ్యుడు ప్రతిపాదించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

శాంతి కోసం అడుగులు
ఇదిలా ఉండగా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి తెరదించేందుకు దౌత్య ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ మేరకు కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండుదేశాలు మూడు రోజుల పాటు యుద్ధానికి స్వస్తి చెప్పి శాంతి చర్చలకు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ఆదేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో అమెరికా రాయబారులు స్టీవ్‌ విట్కాఫ్, జేర్డ్‌ కుష్నర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు మూడు విడతల్లో చర్చలు జరిపారు. విట్కాఫ్, కుష్నర్‌ శనివారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ భేటీ అయిన సంగతి తెలిసిందే. అమెరికా రాయబారులతో సమావేశం అనంతరం జెలెన్‌స్కీ మీడియాతో మాట్లాడారు. తమ గగనతల రక్షణ అవసరాలపైనే వారితో చర్చించినట్లు వెల్లడించారు. పేట్రియాట్‌ ఇంటర్‌సెప్టర్‌ క్షిపణుల ఉత్పత్తిని పెంచేందుకు వాషింగ్టన్‌ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జెలెన్‌స్కీ తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.