
‘బేబీ’ చిత్రంతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీ మళ్లీ తెరపైకి ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ తో సందడి చేశారు. ‘#90s’ వెబ్ సిరీస్‌తో ఆకట్టుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నేటితరం లవ్ స్టోరీ, లివ్-ఇన్ రిలేషన్షిప్, ఆ వయస్సులో ఎదురయ్యే లైఫ్ పజిల్స్ చుట్టూ తిరిగే ఈ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం.
Also Read : టాలీవుడ్ స్టార్లకు బిగ్ షాక్.. రాజమౌళి, సమంత, మహేష్‌కు SIR నోటీసులు.. ఎందుకో తెలుసా?
First half full on entertaining with comedy and great chemistry🩵
Second half brings strong emotions, especially the father son scenes.❤️
BGM is the soul🩵❤️🔥#Epic is a fun and emotional watch. pic.twitter.com/cZKeBcvjTV
— Apsara (@LoveIndia163) September 10, 2026
కథ ఏమిటంటే?
‘#90స్’ సిరీస్ కుటుంబంలోని చిన్న కుమారుడు ఆదిత్య (ఆనంద్ దేవరకొండ) కథ ఇది. చలనచిత్ర దర్శకుడు కావాలనేది అతని బలమైన కోరిక. అయితే మధ్యతరగతి కుటుంబాల సాధారణ ప్లాన్-బి లాగా పైచదువుల కోసం లండన్ వెళ్తాడు. అక్కడ లండన్ యూనివర్సిటీలోనే చదువుతున్న తెలుగమ్మాయి కడలి (వైష్ణవి చైతన్య) పరిచయమవుతుంది. పరిచయం కాస్తా తొలి రోజే సాన్నిహిత్యానికి దారితీసి, ఇద్దరూ కలిసి సహజీవనం ప్రారంభిస్తారు. వేర్వేరు నేపథ్యాలున్న వీరిద్దరి మధ్య బంధం ఎలాంటి మలుపులు తిరిగింది? కెరీర్లో ఇంకా స్థిరపడని ఆదిత్య పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? ఇంటి నుంచి వచ్చే పెళ్లి ఒత్తిడిని కడలి ఎలా ఎదుర్కొంది? అనేది మిగతా కథ.
Also Read : మోక్షజ్ఞ డెబ్యూ ఫిక్స్.. సింబాగా ఎంట్రీ : డైరెక్టర్ ఎవరంటే?
#EPIC review
First half : comedy timing bangundi 👌🏻
Anand anna acting bangundi and
sivaji gari role bangundi 👌🏻Songs & BGM super 👌🏻🔥
Second half : emotional ga undi Anand anna performance and Vaishnavi acting chala bangundi 👌🏻 pic.twitter.com/BqCTHQIpi3
— bhairava™ ! (@Bhairava_1) September 10, 2026
సినిమా ఎలా ఉందంటే?
ఇదొక సాధారణ సినిమా కథలా కాకుండా నేటితరం జంట ప్రయాణాన్ని సహజంగా చూపే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ప్రథమార్ధం అంతా కథానాయకుడు లండన్ వెళ్లడం, నాయికతో పరిచయం, ఫ్రెండ్స్‌తో సరదా సంభాషణలతో చాలా వేగంగా, కామెడీతో సాగిపోతుంది. ముఖ్యంగా ఆదిత్య తన ఫ్రెండ్‌తో మాట్లాడే సన్నివేశాలు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. ద్వితీయార్ధంలో కథ కాస్త గంభీరంగా మారుతుంది. 24 ఏళ్ల వయసులో అబ్బాయిలు ఎదుర్కొనే కెరీర్ ఒత్తిడి, అమ్మాయిలకు ఎదురయ్యే సామాజిక-కుటుంబ ఒత్తిళ్ల మధ్య వ్యత్యాసాన్ని దర్శకుడు బాగా చూపించాడు. అయితే కథ మొత్తం ఒకే చోట తిరుగుతున్నట్లు అనిపించడం వల్ల కాస్త లాగ్ అనిపిస్తుంది. కానీ మొత్తానికి ఎంటర్టైన్మెంట్ ఉందని చెప్పవచ్చు. ఇరుముడితో సక్సెస్‌తో జోష్‌లో ఉన్న సినీ ఇండస్ట్రీకి మరో హిట్ పడిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
నటీనటుల నటన
ఆనంద్ దేవరకొండ అమాయకత్వంతో ఆదిత్య పాత్రలో ఒదిగిపోయాడు. వైష్ణవి చైతన్య కడలి పాత్రలో ఎంతో ఒదిగిపోయింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన బలం. కమెడియన్ సింజిత్ పాత్రలో దర్శకుడు కళ్యాణ్ శంకర్ నవ్వులు పూయించగా, తల్లిదండ్రులుగా శివాజీ, వాసుకి కొద్దిసేపే కనిపించినా తమ పాత్రలకు ప్రాణం పోశారు.
సాంకేతిక విభాగం
హేషమ్ అబ్దుల్ వాహబ్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. అజీమ్ మహ్మద్ సినిమాటోగ్రఫీ లండన్ అందాలను చక్కగా చూపించింది. నిర్మాణం ఎక్కడా తగ్గకుండా ఉంది. అయితే ఈ సినిమా కపుల్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది.









