India vs Pakistan : భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య ఎలాంటి పోటీ అయిన ప్రపంచానికంతటికి ఆసక్తి ఉండటం సర్వసాధారణం. రెండు దాయాది దేశాలు తలపడితే చూడాలని ప్రపంచదేశాలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తుంటాయి. అది క్రికెట్‌ అయినా, మరే పోటీ అయిన రెండు దేశాల మధ్య ఉత్కంఠగా సాగుతుంది. అంతేకాదు ఒకవేళ ఇరుదేశాల కలిసి ఆడినా ఆటలో పలు అంశాలు చర్చకు దారితీస్తాయి. మనవాళ్లు వారితో మాట్లాడకపోవడం, షేక్‌హ్యాండ్‌ ఇవ్వకపోవడం అనేది జరుగుతూనే ఉంటుంది. పాక్‌ తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం, పహల్గాంలో తీవ్రవాద దాడులకు పాల్పడమే దీనికి కారణం.

తాజాగా సూపర్ సీనియర్ల క్రికెట్‌ పోటీ జరగనుంది. అంటే మాజీ క్రికెటర్లు అంతా కలిసి ఆడే టోర్నీ. ఈటోర్నీలో భారత్‌ తరుపున స్టార్‌ ఆటగాళ్లయిన యువరాజ్‌, సురేశ్‌ రైనా, రాబిన్ ఉతప్ప, శిఖర్‌ ధావన్‌ వంటి ప్లేయర్లు బరిలోకి దిగుతారు. ఇక్కడి వరకు బాగనే ఉన్నా..భారత్ – పాకిస్థాన్ పోరంటేనే అభిమానుల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే, గత సీజన్‌లో రెండుసార్లు పాక్‌ ఆడేందుకు టీమ్‌ఇండియా ఆటగాళ్లు విముఖత చూపించారు. అయితే ఇపుడు మరోసారి ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ జరిగే అవకాశం ఉంది. అయితే ఈసారి పాకిస్థా్న్‌ తో తలపడుతారా లేక ఆడకుండా ఉండిపోతారా అనేది ఉత్కంఠగా మారింది.

వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ పేరుతో నిర్వహించే ఈ టోర్నీ ఈ ఏడాది మూడో సీజన్‌కు చేరుకుంది. అక్టోబర్ 3న ప్రారంభమయ్యే ఈ పోటీ 18 వరకు జరుగుతుంది. ఇందులో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో భారత్ – పాకిస్థాన్ ల మధ్య మ్యాచ్ అక్టోబర్ 10న జరగనుంది. కాగా క్రికెట్‌ లెజెండ్స్‌ అయిన యువరాజ్ సింగ్‌, షాహిద్ అఫ్రిది, గేల్, ఏబీ డివిలియర్స్‌, మహ్మదుల్లా రియాద్, డేవిడ్ వార్నర్, మొయిన్ అలీ తదితరులతో కూడిన ఏడు దేశాలు ఈ పోటీలో తలపడనున్నాయి.

Also Read : ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ బతికే ఉన్నాడు.. మసూద్ పెజెష్కియన్‌

గత ఎడిషన్‌లో ఏం జరిగిందంటే

కాగా డబ్ల్యూసీఎల్ 2025 సీజన్‌లో భారత్ – పాక్ జట్ల మధ్య రెండు మ్యాచులు జరగాల్సి ఉంది. అయితే పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా పాకిస్థాన్‌తో ఆడేందుకు టీమ్ఇండియా మాజీ క్రికెటర్లు నిరాకరించారు. పాక్‌ తో ఆడే మ్యాచులను టీమ్ ఇండియా సీనియర్లు బహిష్కరించారు. అందులో ఒక మ్యాచ్‌ గ్రూప్ స్టేజ్‌లో ఆడాల్సి ఉండగా.. మరోసారి సెమీస్‌లో ఆడాల్సి ఉంది. ఇందులో గెలిస్తే ఫైనల్‌కు చేరుకొనేందుకు భారత్ కు అవకాశం ఉంది. అయినప్పటికీ.. తమకు కప్ కంటే భారత ప్రజల మనోభావాలే ముఖ్యమని భావించిన భారత ఆటగాళ్లు గ్రూపుతో పాటు సెమీస్‌లోనూ ఆడడానికి నిరాకరించారు. దీంతో పాక్‌ నేరుగా ఫైనల్‌కు చేరుకునే అవకాశం దక్కింది.ఈ ఏడాది మరోసారి రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత మళ్లీ సెమీస్‌ లేదా ఫైనల్‌లోనూ తలపడే అవకాశం రావచ్చు. మరి ఈసారి టీమ్‌ఇండియా ఆటగాళ్లు వారితో ఆడుతారా? లేక నిరాకరిస్తారా? అనేది తేలాల్సి ఉంది. రెండు దేశాల మధ్య సీనియర్స్ మ్యాచ్‌ ఉంటుందా ఉండదా అనేది ఇపుడు ఆసక్తికరంగా మారింది.

Also Read : రాత్రికి రాత్రే ఎండిపోయిన సముద్రం.. అసలు నిజం ఏంటో తెలుసా?

భారత ఛాంపియన్స్ మ్యాచులు ఇలా…

భారత్‌ VS ఆస్ట్రేలియా – అక్టోబర్ 3 (మధ్యాహ్నం 3.30 గంటలకు)
భారత్ VS ఇంగ్లాండ్ – అక్టోబర్ 4 (రాత్రి 7.30 గంటలకు)
భారత్ VS దక్షిణాఫ్రికా – అక్టోబర్ 6 (మధ్యాహ్నం 3.30 గంటలకు)
భారత్ VS పాకిస్థాన్ – అక్టోబర్ 10 (రాత్రి 7. 30 గంటలకు)
భారత్ VS బంగ్లాదేశ్‌ – అక్టోబర్ 11 (రాత్రి 7. 30 గంటలకు)
భారత్ VS వెస్టిండీస్ – అక్టోబర్ 13 (రాత్రి 7.30 గంటలకు)
అక్టోబర్ 16న రెండు సెమీస్‌లు
అక్టోబర్ 18న గ్రాండ్ ఫైనల్‌ మ్యాచ్‌

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.