APPSC notification 2026 : ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులకు APPSC గుడ్ న్యూస్‌ చెప్పింది. ఈ మేరకు గ్రూప్-1 నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం163 పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 6 నుంచి దరఖాస్తులను స్వీకరించనుండగా.. అక్టోబర్ 27 వరకు గడువు విధించారు. వీటితో పాటు దాదాపు 19 శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు గాను వేర్వేరు నోటిఫికేషన్ ద్వారా పోస్టుల వివరాలను ఏపీపీఎస్సీ పొందుపర్చింది. కాగా ఏపీలో ఖాళీగా ఉన్న వివిధ శాఖలలో 729 పోస్టుల భర్తీ ప్రక్రియకు ఏపీపీఎస్సీ ఈ ప్రకటన విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో పోస్టుల అర్హతల వివరాలను పొందుపరిచింది.

కాగా ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల కాగా మరికొన్ని రానున్న రోజుల్లో విడుదల చేయనున్నారు. ఇందులో గ్రూప్ 1 సర్వీస్ పోస్టులతో పాటు అటవీ, కాలుష్య నియంత్రణ మండలి, గిరిజన సంక్షేమ, మహిళాభివృద్ధి, శిశు సంక్షమ సబార్డినేట్ తదితర అనేక పోస్టులు ఉన్నాయి. కాగా వివిధ శాఖల్లో భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు సంబంధించి అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 20 శాఖలకు సంబంధించి పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఐదు శాఖలకు సంబంధించి పోస్టులకు ఈ నెల 16న నోటిఫికేషన్‌ వెలువడనుంది. మరో 10 శాఖల్లో ఉద్యోగాలకు సంబంధించి ఈనెల 24న ప్రకటన విడుదల కానున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది.

భర్తీ చేయనున్న పోస్టులు ఇవే…

మొత్తం పోస్టులు :163
డిప్యూటీ కలెక్టర్లు: 11
ఏపీ టాక్స్ సర్వీసెస్ అసిస్టెంట్ కమిషనర్లు: 14
డి.ఎస్.పి సివిల్: 36
డీఎస్పీ కమ్యూనికేషన్స్: 3
డీఈవోలు: 14
ఆర్టీవోలు: 3
జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్: 1
డిప్యూటీ రిజిస్టర్ కోపరేటివ్ సర్వీసెస్: 15
మునిసిపల్ కమిషనర్ గ్రేడ్ 2- 12
అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్: 2
డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్: 3
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్: 14
డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్: 35

నోటిఫికేషన్లు ఇవే..

నోటిఫికేషన్ నం.07/2026 వివిధ రకాల పోస్టుల కోసం గ్రూప్-I సర్వీసెస్ పోస్టులకు

నోటిఫికేషన్ నం. 08/2026 ఏ.పి. కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టుకు సంబంధించిన ప్రకటన

నోటిఫికేషన్ నం.09/2026 A.P. ఆర్థిక, గణాంక సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుకు

నోటిఫికేషన్ నం.10/2026 A.P. గిరిజన సంక్షేమ రాష్ట్ర సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుకు

నోటిఫికేషన్ నం.11/2026 A.P. రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ (ఫోరెన్సిక్ ఇంజనీరింగ్ / ఫిజిక్స్ / కెమిస్ట్రీ / బయాలజీ) పోస్టుకు

నోటిఫికేషన్ నం.12/2026 A.P. జువెనైల్ వెల్ఫేర్ కరెక్షనల్ సబ్ సర్వీస్‌లో డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్-II/ఇన్‌టేక్ ప్రొబేషన్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

నోటిఫికేషన్ నం.13/2026 A.P. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ సబార్డినేట్ సర్వీస్‌లో సూపర్‌వైజర్ గ్రేడ్-I పోస్టులకు నోటిఫికేషన్ (కేవలం మహిళలకు మాత్రమే)

నోటిఫికేషన్ నం.14/2026 A.P. ఫ్యాక్టరీల సర్వీస్‌లో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పోస్టుకు

నోటిఫికేషన్ నం.15/2026 A.P. అటవీ సబార్డినేట్ సర్వీస్‌లో డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్-II (టెక్నికల్ అసిస్టెంట్) పోస్టులకు నోటిఫికేషన్

నోటిఫికేషన్ నం.16/2026 A.P. అటవీ సర్వీస్‌లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

నోటిఫికేషన్ నం.17/2026 A.P. అటవీ సబార్డినేట్ సర్వీస్‌లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

నోటిఫికేషన్ నం.18/2026 A.P. అటవీ సబార్డినేట్ సర్వీస్‌లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

నోటిఫికేషన్ నం.19/2026 A.P. ఉద్యానవన శాఖ (Horticulture) సర్వీస్‌లో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుకు

నోటిఫికేషన్ నం.20/2026 A.P. ఆర్థిక, గణాంక సబార్డినేట్ సర్వీస్‌లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుకు

నోటిఫికేషన్ నం.21/2026 నోటిఫికేషన్ A.P. కాలుష్య నియంత్రణ మండలిలో అనలిస్ట్ గ్రేడ్-II పోస్టుకు

నోటిఫికేషన్ నం.22/2026 A.P. శాసనసభ సర్వీసులలో ఇంగ్లీష్ రిపోర్టర్లు, తెలుగు రిపోర్టర్ల పోస్టులకు నోటిఫికేషన్

నోటిఫికేషన్ నం.23/2026 A.P. ఎండోమెంట్స్ సబార్డినేట్ సర్వీస్‌లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-III పోస్టులకు నోటిఫికేషన్

నోటిఫికేషన్ నం.24/2026 A.P. పరిశ్రమల సబార్డినేట్ సర్వీస్‌లో ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

నోటిఫికేషన్ నం.25/2026 A.P. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ సబార్డినేట్ సర్వీసులలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-II పోస్టుకు

నోటిఫికేషన్ నం.26/2026 A.P. సాంఘిక సంక్షేమ సర్వీస్‌లో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, A.P. గిరిజన సంక్షేమ సర్వీస్‌లో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.