Varanasi : మాస్ సినిమాల్లో భక్తి పాటలు కూడా ఒక్కోసారి థియేటర్లలో మంచి ఇంపాక్ట్ చూపిస్తుంటాయి. ఇటీవల వచ్చిన ఇరుముడి సినిమాలోని మల్లెపూల పల్లకి పాట కూడా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన వీడియోకు యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్ వస్తున్నాయి. ఇదే తరహాలో ఇప్పుడు సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాపై మరో ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. సినిమాలో ఓ కీలకమైన సందర్భంలో భక్తి పాటను ఉపయోగించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

Also Read : సమంత సీమంతం.. ఇంతకు శ్రీవిద్య ఉపాసన అంటే ఏమిటి?

అందులో భాగంగా రఘుకుల తిలక రారా అనే పాటను వారణాసిలో పెట్టబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మంచి సిట్యువేషన్‌లో ఈ పాట వస్తుందని, కథకు తగ్గట్టుగా దీనిని ఉపయోగించబోతున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రఘుకుల తిలక రారా పాట ఇప్పటికే భక్తి పాటగా శ్రోతలకు పరిచయమే. కొండల స్వామి పాడిన ఈ పాట 2025 మార్చిలో విడుదలైంది. యూట్యూబ్‌లో ఈ పాటకు ఇప్పటివరకు భారీ సంఖ్యలో వ్యూస్ వచ్చాయి.

ఇప్పుడు ఇదే పాటను మహేష్ బాబు-రాజమౌళి వారణాసిలో ఉపయోగిస్తారనే టాక్ రావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా రాజమౌళి సినిమాల్లో సన్నివేశానికి తగ్గ సంగీతం, భక్తి ఎలిమెంట్స్‌కు ఉండే ప్రాధాన్యత దృష్ట్యా ఈ వార్తపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ పాట నిజంగానే సినిమాలోని కీలక సన్నివేశంలో వస్తే.. థియేటర్లలో ఆ సాంగ్‌కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 2027లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా టైమ్ ట్రావెల్, యాక్షన్, అడ్వెంచర్‌తో పాటు పురాణ అంశాలను కలిపి రూపొందుతున్నట్లు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక షూటింగ్ విషయానికి వస్తే.. వారణాసి దాదాపు 90 శాతం పూర్తయినట్లు తాజాగా టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో మహేష్ బాబు పాల్గొనే భారీ ఇంట్రడక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ పూర్తయితే మహేష్‌కు సంబంధించిన ప్రధాన షూటింగ్ కూడా పూర్తయ్యే అవకాశముంది.

Also Read : సైమా అవార్డ్స్‌ 2026: ఉత్తమ నటుడిగా తేజ సజ్జా.. ఉత్తమ నటిగా ఐశ్వర్య రాజేశ్‌

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.