
Ukraine-Russia War : రష్యా-ఉక్రెయిన్ ఘర్షణలు మరింత తీవ్రరూపం దాల్చాయి. మాస్కోపై ఉక్రెయిన్ వెయ్యికి పైగా డ్రోన్లతో దాడి చేసిన ఘటన మరకవముందే రష్యా ఎదురు దాడికి దిగింది. ఉక్రెయిన్ లోని క్రామటోర్స్క్లో ఉన్న పౌరుల తరలింపు కేంద్రం (Evacuation Hub) పై రష్యా దళాలు ఒక్కసారిగా వైమానిక దాడికి పాల్పడ్డాయి. నిన్న ఉక్రెయిన్ చేసిన దాడికి ప్రతీకారంగాఈ దాడులకు పాల్పడ్డు తెలుస్తోంది. అంతేకాకుండా, కీవ్ ప్రాంతంలో రష్యా జరిపిన డ్రోన్ దాడుల మూలంగా స్థానిక వేర్ ఔస్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనల్లో తీవ్ర ఆస్తి నష్టంతో పాటు పలువురు పౌరులు గాయపడ్డారు.
Also Read : ఇరాన్ పై మరో భీకర దాడికి స్కెచ్.. అమెరికా ఇచ్చిన 5 సిగ్నల్స్ ఇవే!
ఈ సందర్భంగా రష్యా అధికారులు మాట్లాడుతూ తాము ఉక్రెయిన్లోని 146 ప్రాంతాల్లో దాడులు చేసినట్లు ప్రకటించారు. ఉక్రెయిన్లోని రవాణా మౌలిక సదుపాయాలు, ఆయుధ డిపోలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, ఉక్రెయిన్ బలగాలు, విదేశీ కిరాయిసైన్యాన్ని మోహరించిన పలు ప్రాంతాలపై తాము వైమానిక దాడులు చేసినట్లు చెప్పింది. ఇదిలాఉంటే తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సన్నిహితుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. రానున్న రోజుల్లో తమ దేశానికి రెక్కలొస్తాయని ఉక్రెయిన్ జర్నలిస్ట్ దిమిత్రొ గొర్డన్ వ్యాఖ్యానించారు. అతడు జెలెన్స్కీ అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు కచ్చితంగా తెలుసు. కొద్దిరోజుల్లోనే తమకు గొప్ప ఆశను కలిగించేది ఏదో జరుగుతుంది. అదేమిటో ఇపుడే చెప్పలేను. అదొక సైనిక రహస్యం. కానీ, వారం లేక రెండు వారాల్లో మన దేశానికి రెక్కలు తొడిగేలా ఏదో ఒకటి జరుగుతుంది’’ అంటూ ఆయన వ్యాఖ్యానించడం సంచలనంగా మా
Also Read : టెక్ దిగ్గజం ఆపిల్లో ఉద్యోగాల కోత.. రెండు నెలల్లో రెండోసారి..









