US Targets Iranian Airlines : అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులకు ఏ మాత్రం వెరవకుండా యుద్ధం చేస్తున్న ఇరాన్‌ను ఎలాగైన కట్టడి చేయాలని అమెరికా భావిస్తోంది. అందులో భాగంగా ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచేందుకు అమెరికా సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా సెప్టెంబర్ 23వ తేదీ నుంచి అంటే రేపటి నుంచే ఇరాన్‌పై అమెరికా మరొక అస్త్రం ప్రయోగించబోతోంది. అందులో భాగంగా రేపటి నుంచి ఇరాన్ విమానయాన సంస్థల అంతర్జాతీయ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోవచ్చని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ హెచ్చరించారు. ఇరాన్ విమానయాన సంస్థలకు సేవలు అందిస్తే, విదేశీ కంపెనీలు తీవ్రమైన ద్వితీయ ఆంక్షలను ఎదుర్కోవలసి వస్తుందని వాషింగ్టన్ హెచ్చరించడం కలకలం రేపింది.

Also Read : చంద్రుడు మాదే.. ట్రంప్ సంచలన కామెంట్స్‌.. అమెరికా చట్టం ఏం చెబుతోంది?

ఇరాన్‌కు చెందిన అన్ని రకాల విమానయాన సంస్థల సర్వీసులను ప్రపంచ వ్యప్తంగా పూర్తిగా నిలిపివేసేలా చర్యలు తీసుకుంటున్నామని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ వెల్లడించారు. సెప్టెంబర్ 23 (రేపటి) నుంచి ఇరాన్ విమానాలకు సేవలు అందించే విదేశీ సంస్థలు ఎవైనప్పటికి వాటి పై కూడా కఠినమైన ఆంక్షలు విధిస్తామని ఆయన హెచ్చరించారు. సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్కాట్ బెసెంట్ ఈ సందర్భంగా అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 23 నుంచి ఇరాన్‌కు చెందిన విమానయాన సంస్థలను ప్రపంచవ్యాప్తంగా పనిచేయకుండా చేస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఇరాన్ దేశానికి సంబంధించిన విమానం ఏదైనా విదేశీ విమానాశ్రయంలో దిగినట్లయితే వెంటనే చర్యలుంటాయని హెచ్చిరించారు… ఇరాన్‌ విమానాలకు ఇంధనం అందించడం, ల్యాండింగ్ సేవలు కల్పించడం, టికెట్లు విక్రయించడం వంటి సేవలు అందించినట్లయితే ఆ సంస్థలపైనా అమెరికా చర్యలు తీసుకోవడం గ్యారంటీ అని హెచ్చరించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలోని డాలర్ వ్యవస్థ నుంచి ఆయా సంస్థలను తొలగించే అవకాశం ఉందని బెసెంట్ తేల్చి చెప్పారు..

అమెరికా -ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఏడు నెలల కాలానికి చేరువవుతున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.నిజానికి ఇరాన్‌, అమెరికా మధ్య ఉద్రిక్తలు మొదలైన సందర్భంగా నాడు విధించిన ఆంక్షల మూలంగా ఇరాన్ విమానయాన రంగం ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. విమానాలు, విడిభాగాలు, సాంకేతిక పరిజ్ఞానం, నిర్వహణ సేవలు పొందడంలో ఇరాన్ విమానయాన సంస్థలు ఇప్పటికే అనేక ఆంక్షలు ఎదుర్కొంటున్నాయి. ఇరాన్‌కు చెందిన మొత్తం 27 ఇరాన్ విమానయాన సంస్థలను ఇప్పటికే లక్ష్యంగా చేసుకుని అమెరికా ఆంక్షలు విధించింది.

ఈ చర్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ పై ఆర్థిక ఒత్తిడిని పెంచడం, టెహ్రాన్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కుప్పకూల్చడానికి శపథం చేసే “ఎకనామిక్ డి-డే” హెచ్చరికలో భాగంగా పేర్కొంటున్నారు. ఈ తాజా ఆర్థిక హెచ్చరికపై ఇరాన్ ఇంకా అధికారికంగా స్పందించలేదు, కానీ అమెరికా హెచ్చరిక నేపథ్యంలో పలు దేశాలు చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి. ఇరాన్ విమానయాన సంస్థల విమాన రాకపోకలను నిలిపివేస్తున్నట్లు బగ్దాద్ ప్రకటించింది.

Also Read : రేపు అమెరికాకు జిన్‌పింగ్‌… విమానశ్రయానికి ట్రంప్‌ ?

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.