
Odisha : బీహార్లో బాలిక, బాలుడిపై జరిగిన దాడి ఘటన మరువకముందే ఒడిశాలో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ధెంకనాల్ జిల్లాలో ఓ యువ జంటపై కొంతమంది వ్యక్తులు దాడి చేసి వేధించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన ధెంకనాల్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కపిలాష్కు వెళ్లే రోడ్డులో జరిగినట్లుగా తెలుస్తోంది. యువ జంట బైక్పై అక్కడికి వెళ్లిన సమయంలో కొంతమంది వ్యక్తులు వారిని ఆపినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పలువురు వ్యక్తులు ఆ జంట చుట్టూ చేరినట్లు వీడియోలో కనిపిస్తోంది.
Also Read : ఆదిలాబాద్ రిమ్స్ లో అగ్నిప్రమాదం.. ఇద్దరు చిన్నారులు స్పాట్ డెడ్?
#Couple_Allegedly_Harassed_in_Odisha
ODISHA | Viral Video Sparks Outrage : Couple Allegedly Assaulted & Harassed on Kapilash Road in Dhenkanal
🔴Disturbing Footage Surfaces From Dhenkanal : Young Man Allegedly Assaulted, Woman Harassed
🔴Couple Pleads for Help as Alleged… pic.twitter.com/KLUrb1w3a3— NEWS POP (@NEWSPOPFFF) September 22, 2026
వీడియోలో యువకుడిపై కొంతమంది దాడి చేస్తున్నట్లు కనిపించింది. అదే సమయంలో అక్కడ ఉన్న మరికొందరు యువతితో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. తనను, తనతో ఉన్న యువకుడిని వదిలేయాలని యువతి పలుమార్లు వేడుకుంటున్నట్లు వీడియోలో వినిపిస్తోంది. అయినప్పటికీ వారు దాడి, వేధింపులను ఆపలేదని తెలుస్తోంది. అయితే ఈ జంటను ఆ వ్యక్తులు ఎందుకు ఆపారు? వారి మధ్య ముందుగా ఏదైనా గొడవ జరిగిందా? లేదా ఆ వ్యక్తులకు, జంటకు ముందే పరిచయం ఉందా? అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. వీడియో బయటకు రావడంతో పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
గొండియా బ్లాక్ పోలీస్ ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ దలై మాట్లాడుతూ.. ఘటనలో పాల్గొన్న కొంతమంది వ్యక్తులను గుర్తించినట్లు తెలిపారు. పూర్తి దర్యాప్తు తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటన బీహార్లోని జమూయ్లో మైనర్ బాలుడు, బాలికపై జరిగిన దాడి తర్వాత కొన్ని రోజులకే వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. జమూయ్ ఘటనలో సెప్టెంబర్ 19న బాలుడు, బాలికపై దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే కొంతమందిని అరెస్టు చేసి, మిగతా వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. మహిళా పోలీసు అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు చర్యలు కొనసాగిస్తోంది.
Also Read : హైదరాబాద్ – ఖమ్మం నేషనల్ హైవేపై ఘోర ప్రమాదం.. కారులో డాక్టర్ సజీవదహనం









