
US Iran : ఐక్యరాజ్య సమితి 81వ సర్వ ప్రతినిధి సభ కీలక ఘట్టానికి వేదికైంది. గత ఏడు నెలలుగా అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ రెండు దేశాలకు చెందిన ప్రతినిధులు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఐరాస సమావేశాల్లో పాల్గొనడానికి ఇరాన్ బృందానికి అమెరికా వీసా అవకాశాలు కల్పించింది. దీంతో ఇరాన్ బృందం అమెరికాకు చేరుకుని ఐరాస సమావేశంలో పాల్గొంటుంది. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య మూడు గంటల పాటు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ కొన్ని షరతులను యూఎస్ ముందుంచింది.
ఐరాస సమావేశాల్లో భాగంగా అమెరికాకు వచ్చిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ మధ్య మూడు గంటల పాటు ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అంతర్జాతీయ ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని తెలిచే విషయం చర్చకు వచ్చింది. దీనికోసం ఇరాన్ పలు షరతులను అమెరికా ముందు ఉంచారని ఇరాన్ మీడియా వెల్లడించింది. విట్కాఫ్ అభ్యర్థన మేరకే ఈ భేటీ జరిగిందని మీడియా తెలిపింది. తమ షరతులను అమెరికాకు చెప్పడం కోసమే ఈ సమావేశానికి హాజరైనట్లు తెలిపింది.
ఈ సందర్భంగా అమెరికా నౌకా దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేయాలని, ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తులన్నింటిని వెంటనే చెల్లించాలని తదితర డిమాండ్లను ఇరాన్ అమెరికా ముందుంచింది. ఇరాన్ సైనిక కూటములపై జరిగే దాడులను కూడా వెంటనే నిలిపివేయాలని ఈ డిమాండ్ లలో ఒకటిగా ఉంది. అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య సమావేశం చాలా భాగా జరిగిందని అధ్యక్షుడు ట్రంప్ కూడా వెల్లడించారు. భవిష్యత్లో జరగబోయే సమావేశం గురించి కూడా ఇప్పటికే ఖరారు చేసుకున్నామని చెప్పారు.
Also Read : శత్రువుల గోడను బద్దలు కొట్టిన పుతిన్.. పార్లమెంట్లో 355 సీట్లు.. కోలుకోని ట్రంప్!
హర్మూజ్ సమీపంలో పేలుళ్లు..
ఇదిలా ఉండగా ఒకవైపు అమెరికా, ఇరాన్ ప్రతినిధులు భేటీ జరుగుతున్న సమయంలోనే హర్మూజ్ సమీపంలో పేలుళ్లు చోటు చేసుకోవడం కలకలం రేపింది. ఖేష్మ్ ద్వీపం సమీపంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇరాన్ మీడియా ప్రకటించింది. యుద్ధం మొదలైన నాటి నుంచే ఈ ద్వీపం అనేకసార్లు టార్గెట్గా మారింది. ఈసారి నష్ట తీవ్రత ఏస్థాయిలో ఉందో మాత్రం తెలియరాలేదు.
మరోవైపు ఇరాన్ను తుడిచిపెట్టేస్తానని, వారిని నరకానికి పంపుతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐరాస సమావేశం సందర్భంగా ప్రసంగిస్తూ తీవ్ర హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఒప్పందానికి వస్తే గతంకంటే గొప్ప దేశంగా మారుస్తామని కూడా పేర్కొన్నారు. ఆ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సమావేశం, హర్మూజ్ వద్ద పేలుళ్లు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read : అమెరికా గడ్డపై ఇరాన్ అధ్యక్షుడు.. యూఎన్ వేదికగా ట్రంప్ పై ఫైర్ ?









