
BJP : బీజేపీ సంస్థాగతంగా కీలక మార్పులు చేసింది. దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త రాష్ట్ర ఇన్చార్జీలు, సహ ఇన్చార్జీలను నియమించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నియామకాలను ప్రకటించారు. ఈ మార్పులు వెంటనే అమల్లోకి వస్తాయని పార్టీ తెలిపింది. మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి హర్యానా, ఛత్తీస్‌గఢ్ బాధ్యతలు అప్పగించారు. హరీశ్ ద్వివేదికి బిహార్‌తో పాటు కర్ణాటక బాధ్యతలు ఇచ్చారు. వినోద్ తావ్డేను ఉత్తరప్రదేశ్ ఇన్చార్జిగా నియమించారు. ఆయనకు సహ ఇన్‌చార్జీలుగా జగదీశ్ పటేల్, మేధా కులకర్ణి, ప్రదీప్ వర్మ, అనంత్ ఓజాలను నియమించారు.
Also Read : ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్లు.. ఎక్కడెక్కడ అంటే?
ఇక తెలంగాణ బాధ్యతలను సునీల్ బన్సల్ కు అప్పగించారు. తెలంగాణకు అభయ్ పాటిల్, రేఖా శర్మ సహ ఇన్‌చార్జీలుగా నియమితులయ్యారు. ఏపీకి డాక్టర్ అరవింద్ భదౌరియా, సహా ఇన్‌చార్జీలుగా వనతి శ్రీనివాసన్ సహ ఇన్‌చార్జీలుగా నియమితులయ్యారు. కాగా ఇటీవలే బీజేపీ జాతీయ సంస్థలో కూడా మార్పులు చేసింది. కొత్త జాతీయ బృందంలో 13 మంది జాతీయ ఉపాధ్యక్షులు, 8 మంది జాతీయ ప్రధాన కార్యదర్శులు, 16 మంది మోర్చా అధ్యక్షులను నియమించింది. ఇందులో స్మృతి ఇరానీకి జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు కూడా ఇచ్చింది.
రామ్ మాధవ్ కు తమిళనాడు, ఉత్తరాఖండ్ బాధ్యతలు ఇచ్చారు. తరుణ్ చుగ్ కు గుజరాత్, సతీశ్ పూనియాకు జమ్మూకశ్మీర్, పంజాబ్ బాధ్యతలు అప్పగించారు. అనిల్ ఆంటోనీకి నాగాలాండ్ ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వడంతో పాటు గోవా సహ ఇన్చార్జిగా నియమించారు. రాజస్థాన్‌కు సంజయ్ భాటియాను ఇన్చార్జిగా నియమించారు. కవితా పాటిదార్, కుల్జీత్ చహల్ సహ ఇన్‌చార్జీలుగా ఉంటారు. ఢిల్లీ బీజేపీ ఇన్చార్జిగా వినయ్ సహస్రబుద్ధేను నియమించగా.. జమ్యాంగ్ నంగ్యాల్, దర్శనా జర్దోష్ సహ ఇన్‌చార్జీలుగా నియమితులయ్యారు. మహారాష్ట్ర బాధ్యతలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ జయ్ పాండాకు అప్పగించారు. ఆయనతో పాటు అమిత్ మాలవీయ, సదానంద్ షెట్ తనవాడే, కమల్జీత్ సెహ్రావత్ సహ ఇన్‌చార్జీలుగా ఉంటారు.
Also Read : మందు బాబులకు అలర్ట్.. వరుసగా 3 రోజులు.. బార్లు, వైన్ షాప్‌లు బంద్









