హీరో నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో నేడు ‘ది ప్యారడైజ్’ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 23 రాత్రి నుంచి ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా వారి ఓపీనియన్‌ను షేర్ చేసుకుంటున్నారు. అయితే కొందరు సినిమా బాగుందని, మరికొందరు నార్మల్ ఉందని మిక్సిడ్ టాక్ వినిపిస్తోంది.

Also Read : ఇళయరాజాకు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం

సినిమా కథ, నేపథ్యం విషయానికి వస్తే ప్రారంభంలోనే ‘పారడైజ్ వరల్డ్’ గురించి పరిచయం చేసే దాదాపు 10 నిమిషాల ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకుందని నెటిజన్లు చెబుతున్నారు. నాని టైటిల్ కార్డు, పారడైజ్ ప్రపంచం, అక్కడి వాతావరణం, పాత్రల పరిచయం సినిమాపై ఉత్సుకతను పెంచుతాయి. నాని చిన్నప్పటి సన్నివేశాలు కూడా కథలోకి బాగా తీసుకెళ్తాయని ప్రేక్షకులు అంటున్నారు. ఆ తర్వాత వచ్చే నాని క్యారెక్టరైజేషన్, మాస్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థియేటర్లలో ఈలలు వేయించేలా డిజైన్ చేశారని చెప్పవచ్చు.

నాని ఇంట్రడక్షన్ సీన్, జైలు లోపల జరిగే ఫైట్ సీక్వెన్స్ అదిరిపోయాయని ట్విట్టర్‌లో పోస్ట్‌లు చేస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల ఈ సన్నివేశాన్ని పవర్ ఫుల్‌గా, రస్టిక్ మాస్ ఎలివేషన్స్‌తో తెరకెక్కించారని.. నాని కెరీర్‌లోనే ఇది ఒక బెస్ట్ మాస్ ఇంట్రడక్షన్‌గా నిలిచిపోతుందని ఫ్యాన్స్ అంటున్నారు. అంతే కాకుండా సినిమాలో వచ్చే బిర్యానీ ఫైట్ సీక్వెన్స్ చాలా వినూత్నంగా ఉందని.. యాక్షన్ ప్రియులకు ఇది మంచి విందులా అనిపిస్తుందని నెటిజన్లు పేర్కొన్నారు.

ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్‌ అని చెప్పవచ్చు. నాని ఇంట్రడక్షన్, జైలు ఫైట్ సీన్లు, ఇంటర్వెల్ బ్లాక్‌లో అనిరుధ్ ఆర్‌ఆర్‌ నెక్స్ట్ లెవెల్‌లో ఉందంటున్నారు. ముఖ్యంగా ఆయా షేర్, సమ్మక్క పాటలు రాగానే థియేటర్లలో ప్రేక్షకులు డ్యాన్సులతో రచ్చ చేసినట్లు తెలుస్తోంది. ఈ పాటలు కూడా అదిరిపోయాయని ఫ్యాన్స్ అంటున్నారు.

ప్రీ-ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు సినిమాకే ప్రధాన హైలైట్‌గా నిలిచాయని టాక్ వస్తోంది. మాస్ ఎలివేషన్స్, అనిరుధ్ పవర్ ఫుల్ మ్యూజిక్ కలగలిసి ఇంటర్వెల్ బాంగ్‌ను వేరే స్థాయికి తీసుకెళ్లాయని ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ ప్రారంభ సన్నివేశాల్లో ఎడిటింగ్ వర్క్ అంతగా ఆకట్టుకోలేదని.. కొన్ని చోట్ల ఫ్లో దెబ్బతిన్నట్లు అనిపించిందని కొందరు కామెంట్స్ చేశారు. హీరోయిన్ కయాదు లోహర్ యాక్టింగ్, అందంతో ఆకట్టుకుందని ఫ్యాన్స్ అంటున్నారు. అలాగే మోహన్ బాబు యాక్టింగ్‌తో అదరగొట్టారని తెలుస్తోంది.

Also Read : పెళ్లి కాకపోయినా పర్లేదు.. తల్లి కావాలని ఉంది: శ్రుతి హాసన్ సంచలన కామెంట్స్!

కాకపోతే ఎక్కువగా చంపుకోవడం ఉందని, స్క్రీన్‌ప్లే ఇంకాస్త గ్రిప్పింగ్‌గా ఉంటే బాగుండేదని కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు. ఫైనల్‌గా ఫస్ట్ హాఫ్ కొన్ని చోట్ల డీసెంట్‌గా, యావరేజ్‌గా ఉన్నప్పటికీ.. నాని మాస్ స్క్రీన్ ప్రెజెన్స్, అనిరుధ్ బీజీఎం, ఇంటర్వెల్ బ్లాక్ సినిమాను నిలబెట్టాయని అంటున్నారు.