
ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేస్తామంటూ ఇటీవల హెచ్చరికలు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ రాయబార కార్యాలయం ఇచ్చిపడేసే కౌంటర్ ఇచ్చింది. సోషల్ మీడియా ద్వారా డైరెక్ట్ కౌంటర్ కాకుండా ఏకంగా నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ వీడియో క్లిప్‌తో ఇరాన్ ఎంబసీ అమెరికాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
Also Read : ట్రంప్‌కి ఇరాన్ షాక్.. అమెరికా నౌకలు వేలం.. వచ్చిన డబ్బుతో సంచలన నిర్ణయం
Trump talks about annihilating Iran.
But he knows Iran is not defenseless.
Since we informed they have recently been watching Bollywood instead of Hollywood. pic.twitter.com/v6Le8zkH5X
— Iran Embassy in Zimbabwe (@IRANinZIMBABWE) September 23, 2026
“మేము రెడీ.. మీరు రెడీనా?” అని సవాల్ విసిరేలా ఉన్న బాలయ్య పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాన్ని ఇరాన్ ఎంబసీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రంప్ వ్యాఖ్యలకు దిమ్మతిరిగే రీతిలో కౌంటర్ ఇచ్చింది. బాలయ్య మార్క్ పవర్, ఆటిట్యూడ్ ఉన్న ఈ వీడియో క్లిప్ ద్వారా తమను తక్కువ అంచనా వేస్తే చూస్తూ ఊరుకోం.. దేనికైనా సిద్ధం అనే సంకేతాన్ని ఇరాన్ దౌత్య కార్యాలయం చాలా వినూత్నంగా పంపించింది. ఈ సీన్లో బుల్లెట్లతో దాడి చేస్తే బాలయ్య వాటిని తిప్పి కొట్టి వేస్ట్ చేస్తారు. అయితే అమెరికా కూడా ఇలాగే ఇరాన్‌పై దాడి చేసి తమ దేశ ఆయుధాలను వేస్ట్ చేసిందని, వాటిని మేం తిప్పికొడతామనే ఉద్దేశంతో ఇరాన్ కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే అమెరికా, ఇరాన్ మధ్య గత కొంతకాలంగా తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో సైతం ఇరుదేశాల నాయకులు తీవ్రస్థాయిలో పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. మరి ఇరాన్ రాయబార కార్యాలయం ఇచ్చిన కౌంటర్‌కు డొనాల్డ్ ట్రంప్ ఇంకా స్పందించలేదు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. దీంతో బాలయ్య ఫ్యా్స్ నెట్టింట రచ్చ చేస్తున్నారు. గ్లోబల్ లెవెల్లోనూ మన బాలయ్య మాస్ సత్తా చాటాడు అని.. ఇంటర్నేషనల్‌లో కూడా బాలయ్య మాస్ వీడియో వైరల్ అవుతుందని అంటున్నారు.
Also Read : భగ భగ మండే సూపర్ ఎల్‌నినో.. రాబోయే రోజుల్లో 4.5 లక్షల మంది బలి.. కారణమేంటంటే?









