Air India Express :  పండగల సీజన్‌ నేపథ్యంలో విద్యార్థులకు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. దేశీయ విమాన టికెట్లపై 10 శాతం డిస్కౌంట్‌తో పాటు 25 కిలోల వరకు బ్యాగేజీ తీసుకెళ్లే అవకాశం కల్పించింది. ఈ ఆఫర్‌ అక్టోబరు 20, 2026 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌లో భాగంగా విద్యార్థులకు దేశీయ విమానాల వాల్యూ ఫేర్‌పై 10 శాతం తగ్గింపు లభిస్తుంది.

సాధారణంగా అనుమతించే 15 కిలోల బ్యాగేజీకి బదులుగా అదనంగా 10 కిలోలు కలిపి మొత్తం 25 కిలోల వరకు తీసుకెళ్లవచ్చు. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ ద్వారా నేరుగా టికెట్‌ బుక్‌ చేసుకునే విద్యార్థులు రూ.99కే ప్రయాణ తేదీని మార్చుకునే సదుపాయం పొందవచ్చు. అదేవిధంగా వెబ్‌సైట్‌, యాప్‌ ద్వారా దేశీయ లేదా అంతర్జాతీయ విమానాలను నేరుగా బుక్‌ చేసుకునే ప్రయాణికులకు VIBES కోడ్‌తో అదనంగా 5 శాతం డిస్కౌంట్‌ పొందే అవకాశం ఉంది.

Also Read : బిహార్‌లో మరో దారుణం.. బాలికపై యువకుల వేధింపులు, వీడియో వైరల్!

దీనికి నిబంధనలు వర్తిస్తాయి. ఈ ఆఫర్‌ను పొందేందుకు విద్యార్థుల వయసు కనీసం 12 సంవత్సరాలు ఉండాలి. గుర్తింపు పొందిన విద్యా సంస్థ జారీ చేసిన చెల్లుబాటు అయ్యే స్టూడెంట్‌ ఫొటో ఐడీ తప్పనిసరిగా ఉండాలి. అందులో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వివరాలు ఉండాలి. విమానాశ్రయంలో చెక్‌-ఇన్‌ సమయంలో ఈ గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ మరో ఆఫర్‌ను కూడా అందిస్తోంది.

అర్హత కలిగిన వీసా డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లు బుక్‌ చేసుకునే వారికి గరిష్ఠంగా రూ.600 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్‌ను పొందేందుకు VISAFLY కోడ్‌ను ఉపయోగించాలి. ఈ ఆఫర్‌ అక్టోబరు 9, 2026 వరకు చెల్లుబాటు అవుతుంది. ప్రస్తుతం ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ రోజుకు 500కుపైగా విమానాలను నడుపుతూ 48 దేశీయ, 16 అంతర్జాతీయ గమ్యస్థానాలను కలుపుతోంది. సంస్థ వద్ద 100కుపైగా బోయింగ్‌ 737, ఎయిర్‌బస్‌ ఏ320 విమానాలున్నాయి.

Also Read : మిస్సింగ్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. 9 ముక్కలుగా చేసి బ్యాగుల్లో!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.