
Gurugram : హర్యానాలోని గురుగ్రామ్‌లో విషాద ఘటన జరిగింది. సోహ్నాలోని ఓ అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి దూకి దీప అనే మహిళ చనిపోయింది. అయితే భర్త జితేంద్ర, అతని స్నేహితుడు అంగద్ వేధింపుల వల్లే దీప ఈ నిర్ణయం తీసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీప తన భర్త జితేంద్ర, 8 ఏళ్ల కుమారుడు దక్ష్‌తో కలిసి ఎంవీఎన్ ఏథెన్స్ సొసైటీలో ఉంటోంది.
Also Read : బెంగళూరుకు వచ్చే MLAలకు రెండు పెళ్లిళ్లు.. సీఎం సంచలన కామెంట్స్!
దీప తండ్రి రామ్‌కిషన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. దీపకు 2018లో జితేంద్రతో పెళ్లి జరిగింది. పెళ్లి అయిన కొంతకాలానికే జితేంద్ర ఎక్కువగా మద్యం తాగడం మొదలుపెట్టాడని, దాంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవని ఆయన చెప్పారు. కొన్నిసార్లు దీపను కొట్టేవాడని కూడా ఆరోపించారు. జితేంద్ర తన స్నేహితుడు అంగద్‌ను తరచూ ఇంటికి తీసుకొచ్చి ఇద్దరూ కలిసి మద్యం తాగేవారని రామ్‌కిషన్ చెప్పారు. అంగద్‌ను ఇంటికి తీసుకురావద్దని దీప భర్తను అడిగిందని, దీంతో ఆమెను మరింత వేధించేవారని ఆరోపించారు.
భర్త, అతని స్నేహితుడి వేధింపులతో దీప చాలా బాధపడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె బాల్కనీ నుంచి కిందకు దూకి చనిపోయిందని చెప్పారు. ఉదయం 6 గంటల సమయంలో ఈ విషయం పోలీసులకు తెలిసింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి, దీప మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి పంపించారు. పోలీసులు అక్కడి నుంచి దీప మొబైల్ ఫోన్, రక్త నమూనాలను కూడా తీసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో జితేంద్ర ఇంట్లోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
దీప తండ్రి ఫిర్యాదు ఆధారంగా జితేంద్ర, అంగద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తన కుమార్తె మృతికి వారిద్దరే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
Also Read : ప్రతిపక్షాలు ఎన్నికల్లో పోటీ చేయొద్దు : అభిజీత్ దీప్కే సంచలన ప్రకటన!









