
Tirupati : తిరుపతిలో కొద్దిసేపటి క్రీతం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. డీబీఆర్ రోడ్డులో ప్రైవేట్ హోటల్ నిర్మాణ పనులు చేపడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణ పనుల కోసం వినియోగించిన భారీ క్రేన్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా పక్కకు ఒరిగి లోతులో దిగబడిపోవడంతో ఒక్కసారిగా కిందకు పడిపోయింది. దీంతో క్రేన్ కింద చిక్కుకుని ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను రుయా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా క్రేన్‌ను తొలగించే పనులు చేపట్టిన పోలీసులు దానికింద ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : శంషాబాద్ దిశ ఘటన స్థలంలో దారుణం… మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడి యత్నం
Also Read : ఇబ్రహీంపట్నం మహిళ హత్య మిస్టరీ వీడింది.. ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు!









