
Silicon Valley : అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఓ రహస్య జాబితా చర్చనీయాంశంగా మారింది. ఇందులో 100 మందికి పైగా పేర్లు ఉన్నట్లు న్యూయార్క్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. వీరిపై లైంగిక వేధింపులు, అత్యాచారం వంటి ఆరోపణలు ఉన్నాయని తెలిపింది. అయితే ఈ జాబితాలో పేరు ఉండటం వల్ల ఆరోపణలు నిజమని అర్థం కాదని కూడా ఆ కథనం పేర్కొంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తమ ఉద్యోగాలు, భవిష్యత్ కెరీర్ దెబ్బతింటాయనే భయంతో కొందరు మహిళలు ఈ విషయాలను బయటకు చెప్పలేకపోతున్నారని కథనం తెలిపింది. అందుకే ఒకరికి ఒకరు సమాచారం చెప్పుకునేందుకు ఈ రహస్య జాబితాను ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది.
సిలికాన్ వ్యాలీలో యువ టెక్ ఉద్యోగులు కలిసి ఉండే హ్యాకర్ హౌసెస్ లో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినట్లు తేలిపింది. కొన్ని సందర్భాల్లో మహిళలు మత్తు పదార్థాలు ఇచ్చి లైంగిక దాడులకు పాల్పడ్డారని ఆరోపించినట్లు తెలిపింది. ఒక మహిళ 2021లో ఓ టెక్ కంపెనీకి చెందిన వ్యక్తిపై అత్యాచారం, లైంగిక దాడి ఆరోపణలు చేసింది. మరో మహిళ 2025లో జరిగిన ఓ సమావేశంలో మత్తు పదార్థం తీసుకున్న తర్వాత తన అనుమతి లేకుండా లైంగిక సంబంధం జరిగిందని ఆరోపించింది.
Also Read : దుబాయ్ విమానంలో హైజాక్ సంకేతాలు.. రంగంలోకి దిగిన ఫైటర్ జెట్లు
Just found out my former housemate was assaulted by a member of a San Francisco group house called The Muse.
Tl;dr: The dark underbelly of SF’s “community culture” often protects predators in the ecosystem over victims.
SF folks connected to the Muse or know people seeking to… pic.twitter.com/pKzCZk0HHI
— Yehong Zhu (@YehongZhu) February 26, 2026
మరో సందర్భంలో ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఆ వ్యక్తిని అక్కడి నుంచి పంపించేశారని, ఆ తర్వాత మరికొందరు మహిళలు కూడా అతడిపై ఫిర్యాదులు చేసినట్లు కథనం తెలిపింది. ఇలాంటి ఘటనలపై ఫిర్యాదు చేయడానికి మహిళలకు సరైన మార్గాలు లేకపోవడం పెద్ద సమస్యగా మారిందని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. బాధితులు తమ వివరాలను రహస్యంగా చెప్పుకునేందుకు పనిచేసిన ‘కాలిస్టో’ అనే సంస్థ కూడా కొత్త కేసులను తీసుకోవడం ఆపేసింది.
ఇలాంటి రహస్య జాబితాలు మహిళలను ఒకరినొకరు హెచ్చరించుకునేందుకు ఉపయోగపడుతున్నప్పటికీ.. అందులో ఉన్న ఆరోపణలు నిజమా కాదా అనేది విడిగా నిర్ధారించాల్సి ఉంటుందని కథనంలో వెల్లడించింది.
Also Read : అమెరికా వెళ్లాలంటే ఏడాది వెయిటింగ్.. ఇండియన్స్ కు మరింత వీసా కష్టాలు









