
Ketan Agarwal Murder Case : కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో సంచలన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కేసు దర్యాప్తును చేస్తున్న పోలీసులకు మరో విషయం తెలిసింది. కేసులో నిందితుడిగా ఉన్న చేతన్ చౌదరి.. హత్యకు సుమారు ఏడాది ముందు మరో యువతితో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఆ యువతి, ఆమె స్నేహితురాలి వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 2026 మే 9న పుణెలో ఓ కాలేజీ విద్యార్థినితో చేతన్ లైంగిక సంబంధం పెట్టుకోవడానికి ట్రై చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. లాతూర్కు చెందిన ఆ యువతి అప్పట్లో తన స్నేహితురాలితో కలిసి పుణెలో ఉంటోంది. ఈ ఘటనపై ఇద్దరు యువతుల వాంగ్మూలాలను పోలీసులు తీసుకున్నారు. యువతి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. ఆమె తన స్నేహితురాలితో కలిసి ఎస్బీ రోడ్డులోని ఓ క్లబ్‌కు పార్టీ కోసం వెళ్లింది. వారితో ఒక యువతి బాయ్‌ఫ్రెండ్, చేతన్ చౌదరి కూడా ఉన్నారు.
Also Read : ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి ఫేక్ నోట్లు తయారీ.. కూరగాయల వ్యాపారి అరెస్ట్
నలుగురూ మద్యం సేవించిన తర్వాత అర్ధరాత్రి మార్కెట్ యార్డ్ ప్రాంతంలోని ఓ లాడ్జికి వెళ్లారు. లాడ్జికి వెళ్లిన తర్వాత యువతి స్నేహితురాలు తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఒక గదిలోకి వెళ్లగా.. మరో యువతి చేతన్‌తో కలిసి మరో గదిలోకి వెళ్లినట్లు ఆమె వాంగ్మూలంలో పేర్కొంది. అక్కడ చేతన్ తనతో బలవంతంగా తనతో లైంగిక సంబంధం ఏర్పరచుకునేందుకు ప్రయత్నించాడు. మరుసటి రోజు జరిగిన విషయాన్ని తన స్నేహితురాలికి చెప్పినట్లు ఆమె వెల్లడించింది. చేతన్ తనతో కూడా రెండు, మూడు సార్లు లైంగిక సంబంధాన్ని ఏర్పరచుకునేందుకు ప్రయత్నించాడని ఆమె స్నేహితురాలు పోలీసులకు వెల్లడించింది.
ఇక కేసు విషయానికి వస్తే.. కేతన్ అగర్వాల్ అనే 25 ఏళ్ల యువకుడికి సియా గోయల్‌తో పెళ్లి ఫిక్స్ అయింది. ఇద్దరికీ ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం కూడా జరిగింది. నవంబర్‌లో పెళ్లి చేయాలని రెండు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అయితే సియా అప్పటికే చేతన్ చౌదరితో లవ్ లో ఉంది, పెళ్లి ఇష్టం లేకపోవడంతో సియా, చేతన్ కలిసి కేతన్‌ను హత్య చేయాలని ప్లాన్ వేశారు. ఈ కేసులో రితేష్ హాంగే అనే మరో వ్యక్తి పేరు కూడా బయటకు వచ్చింది.
2026 జూన్ 18న సియా, కేతన్‌ను పుణెలోని లోహగడ్ ఫోర్ట్‌కు తీసుకెళ్లింది. సియా పుట్టినరోజు మరుసటి రోజు కావడంతో అక్కడికి వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. మొదట కేతన్ ప్రమాదవశాత్తూ కొండపై నుంచి జారిపడి చనిపోయాడని సియా చెప్పింది. కానీ దర్యాప్తులో పోలీసులుకు అసలు నిజాలు తెలియడంతో ఆమెతో పాటుగా చేతన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read : శంషాబాద్ దిశ ఘటన స్థలంలో దారుణం… మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడి యత్నం









