
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి తదుపరి విడత సొమ్ము త్వరలోనే అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ కాబోతోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సాయం ద్వారా ప్రతీ విడతలో రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో పడతాయి. అయితే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారని ఈ మూడు పనులు చేయకుండా లైట్ తీసుకుంటే మాత్రం పప్పులో కాలు వేసినట్లే. అయితే రైతులు తప్పుకుండా పూర్తి చేయాల్సిన ఆ మూడు పనులు ఏంటో చూద్దాం.
Also Read : సీఈసీ వర్సెస్ జెన్-జెడ్.. గాంధీ మార్గంలో సీజేపీ వినూత్న నిరసన!
ఈ-కేవైసీ పూర్తి చేయడం
పీఎం కిసాన్ పోర్టల్‌లో eKYC ప్రక్రియ తప్పకుండా పూర్తి చేయాలి. మీ గుర్తింపు కార్డుకు మొబైల్ నంబర్ అనుసంధానమై ఉంటే PM Kisan అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఓటీపీ పొంది ఉచితంగానే మీ ఇంట్లోనే eKYC పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ మొబైల్ నంబర్ లింక్ కాకపోతే.. మీ సమీపంలోని మీసేవ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్తే బయోమెట్రిక్ విధానంలో వెంటనే పూర్తి చేస్తారు.
బ్యాంక్ ఖాతాకు డీబీటీ (DBT) & NPCI సీడింగ్
కేవలం బ్యాంక్ ఖాతాలో గుర్తింపు కార్డును జత చేస్తే సరిపోదు. కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం నేరుగా డెలివరీ కావాలంటే Direct Benefit Transfer పద్ధతి తప్పనిసరి. అందుకోసం మీ బ్యాంక్ అకౌంట్ NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సర్వర్‌తో మ్యాప్ అయి ఉండాలి. మీ బ్యాంక్ శాఖను సంప్రదించి, మీ ఖాతా డీబీటీ, NPCI సీడింగ్ యాక్టివ్‌గా ఉందో లేదో సరిచూసుకోవాలి.
ల్యాండ్ సీడింగ్
మీ పేరుపై సాగుకు అనువైన భూమికి సంబంధించిన రికార్డులు ప్రభుత్వం వద్ద సరిగ్గా నమోదై, పీఎం కిసాన్ పోర్టల్‌లో అప్డేట్ అయి ఉండాలి. ల్యాండ్ సీడింగ్ వివరాలలో ఏ చిన్న తప్పు ఉన్నా లేదా పోర్టల్‌లో అప్డేట్ కాకపోయినా రాబోయే విడత డబ్బులు నిలిచిపోతాయి.
Also Read : హోటళ్లు, రెస్టారెంట్లకు బిగ్ షాక్.. పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు!
లబ్ధిదారుల స్టేటస్ ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in కు వెళ్లాలి.
హోమ్‌పేజీలోని ‘Farmers Corner’ విభాగంలో ఉన్న ‘Know Your Status’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
మీ రిజిస్ట్రేషన్ నంబర్, స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి ‘Get Data’ బటన్ నొక్కండి.
అక్కడ స్క్రీన్‌పై e-KYC Status, Aadhaar Bank Seeding Status, Land Seeding అనే మూడు ఆప్షన్ల వద్ద పచ్చటి రంగులో ‘YES’ అని ఉందో లేదో సరిచూసుకోండి.
ఎక్కడైనా ‘NO’ అని కనిపిస్తే, వెంటనే సంబంధిత వ్యవసాయాధికారులను లేదా మీసేవ కేంద్రాలను సంప్రదించి అవసరమైన పత్రాలు సమర్పించి అప్డేట్ చేయించుకోండి.









