Elon Musk : ఇన్‌స్టా గ్రాం వినియోగం విషయంలో ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్‌ మస్క్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చర్చనీయంశంగా మారాయి. ఒక వినియోగదారుడు చేసిన కామెంట్‌కు ఆయన ఇచ్చిన సమాధానం వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రాంను మహిళలే ఎక్కువగా వినియోగిస్తున్నారని, వారే ఎక్కువగా పోస్టులు పెడుతున్నారని, ఒక రకంగా అది ఫీమేల్ యాప్ అని జీజర్ క్యాపిటర్ అనే యూజర్ తన ఎక్స్ అకౌంట్‌లో కామెంట్ చేశారు. అందుకే ఆ ఫీమేల్ యాప్‌ను డిలీట్ చేశానని అతను చెప్పారు. కాగా ఆ యూజర్‌ చేసిన కామెంట్‌కు మస్క్ స్పందిస్తూ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.

Also Read : రష్యాపై దాడి చేస్తే అన్ని ఆయుధాలు వాడతాం.. పుతిన్ వార్నింగ్

‘అవును, ఇన్‌స్టాగ్రాం ఉన్నది గర్ల్స్ కోసమే’ అంటూ మస్క్ సరదాగా రిప్లై ఇచ్చారు. దీంతో మస్క్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు ఇది పెద్ద చర్చకు తెరతీసింది. దీనిపై పలువురు నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ మస్క్ కామెంట్‌కు తమదైన రీతిలో సమాదానం చెప్తున్నారు. ‘ఇన్‌స్టాగ్రాం గర్ల్స్‌ది అయితే, ఎక్స్ ఎవరిది? ఎక్స్ పురుషులదా? దానిని పురుషుల యాప్‌గా అర్థం చేసుకోవచ్చా’ అంటూ ఓ యూజర్ మస్క్‌ను ప్రశ్నించారు. ఇక మరో యూజర్ అయితే ఎక్స్ గురించి అనేక ప్రశ్నలు సంధించారు. ‘ఇన్‌స్టాగ్రాం యాప్ ఒక్క మహిళల కోసమే అంటే నేను ఒప్పుకోను. అన్ని జెండర్ల కోసమూ ఆ యాప్ ఉంది. అన్ని జెండర్ల వారు ఆ యాప్ వాడుతున్నారు’ అంటూ మరో యూజర్ ట్వీట్ చేశారు. ఇన్‌స్టాగ్రాం అందరి కోసం అని మరో నెటిజన్ సమాధానం ఇచ్చారు. వీరే కాక అనేకమంది యూజర్లు ఈ విషయమై స్పందిస్తూ తమదైన రీతిలో రిప్లై ఇస్తున్నారు.

కాగా, ఇన్‌స్టాగ్రాం గురించి ఎలాన్ మస్క్ ఇలా కామెంట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. సోషల్ మీడియా అలవాట్లు, ఆన్‌లైన్ ట్రెండ్ల గురించి ఆయన గతంలోనూ వ్యాఖ్యానించారు. ఒక వైరల్ త్రెడ్‌కు జవాబు ఇస్తూ ఈ ఏడాది మే నెలలోనూ ఆయన అలాంటి వ్యాఖ్యలే చేయడం చర్చనీయంశంగా మారింది. తమ జీవితంలోని వివిధ దశల గురించి ప్రజల ఆన్‌లైన్ అలవాట్లు ఎలా ప్రతిఫలిస్తాయన్న చర్చపై మస్క్ గతంలో స్పందించారు. తనకు ఇన్‌స్టాగ్రాం ప్రొఫైళ్లను షేర్ చేసే పురుషులను ఉద్దేశించి ఆయన అప్పుడు ఎద్దేవా చేశారు. ‘పురుషులు నాకు వారి ఇన్‌స్టా్గ్రాం పోస్టులు పంపుతూ ఉంటారు. పురుషులు మార్పు చెందుతున్నారా అని వారి ప్రొఫైల్స్ చూస్తే నాకు అనిపిస్తుంది’ అని ఎలాన్‌ మస్క్ ప్రశ్నించారు. దీంతో ఆయన కామెంట్లు వైరల్‌గా మారి తీవ్ర డిబెట్‌కు దారి తీశాయి. మస్క్ చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని పలువురు యూజర్లు విమర్శించారు. తాజాగా ఇన్‌స్టా గ్రాం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా అదే స్థాయిలో వైరల్‌గా మారాయి.

Also Read : ఇరాక్‌కు గుడ్ బై చెప్పేసిన అమెరికా.. 23 ఏళ్ల బిగ్ డ్రామాకి ఎండ్ కార్డ్.. వెనకున్న మాస్టర్ ప్లాన్ ఇదే!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.