Rachita Ram : కన్నడ ఇండస్ట్రీలో డింపుల్‌ క్వీన్‌ గా గుర్తింపు తెచ్చుకున్న నటి రచ్చితా రామ్‌ 34వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్‌లో ఉన్న ఆమె ఇంటి దగ్గరకు అర్ధరాత్రి భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. తమ అభిమాన నటిని చూసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రచ్చితా రామ్‌ కూడా అభిమానులతో కలిసి కేక్‌ కట్‌ చేసి తన బర్త్‌డేను సెలబ్రేట్‌ చేసుకున్నారు.

బర్త్‌డే సందర్భంగా తనను కలవడానికి వచ్చిన ప్రతి అభిమానితో రచ్చితా రామ్‌ సెల్ఫీలు దిగారు. ఈ క్రమంలో ఓ అభిమాని ఆమె దగ్గరకు వచ్చి సెల్ఫీ తీసుకున్నాడు. తిరిగి వెళ్లే సమయంలో ఒక్కసారిగా ఆమె బుగ్గలను గిల్లాడు. దీంతో రచ్చితా రామ్‌ క్షణం పాటు షాక్‌ అయ్యారు. వీడెవడు అన్నట్టుగా కాస్త కోపంగా చూస్తూనే నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన రచ్చితా రామ్‌ అభిమానులు.. కోపంలో కూడా మా డింపుల్‌ క్వీన్‌ చాలా క్యూట్‌గా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Also Read : దేవర మార్ఫింగ్‌ వీడియో : వాళ్లను వదిలిపెట్టను.. NTR స్ట్రాంగ్‌ వార్నింగ్‌

ఇదిలా ఉంటే.. తన పుట్టినరోజు సందర్భంగా నటుడు దర్శన్‌ను కలిసేందుకు వెళ్లిన విషయాన్ని కూడా రచ్చితా రామ్‌ గుర్తుచేసుకున్నారు. దర్శన్‌ ఆశీర్వాదం తీసుకోవాలని ఆయనను కలవడానికి వెళ్లానని చెప్పారు. అయితే వారానికి కేవలం రెండు సార్లు మాత్రమే కలిసేందుకు అవకాశం ఉండటంతో.. ఆ సమయంలో కుటుంబ సభ్యులు దర్శన్‌ను కలవాల్సి ఉండటంతో తనకు నేరుగా కలిసే అవకాశం రాలేదన్నారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఎదురుచూసి తిరిగి వచ్చానని రచ్చితా రామ్‌ తెలిపారు. దర్శన్‌ ఆశీర్వాదం ఎప్పుడూ తనపై ఉంటుందని.. రాబోయే రోజుల్లో తప్పకుండా ఆయనను కలిసి ఆశీర్వాదం తీసుకుంటానని భావోద్వేగంగా చెప్పారు.

Also Read : హీరో భార్యకు నేను నచ్చలేదట.. అందుకే సినిమా నుంచి తీసేశారు: తాప్సీ

చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించక ముందే రచితా రామ్ టెలివిజన్‌లో తనదైన ముద్ర వేసింది. ఆమె ప్రముఖ సీరియల్స్‌లో నటించి కన్నడ టెలివిజన్ ప్రేక్షకులకు సుపరిచితురాలైంది. టెలివిజన్‌లో ఆమెకు లభించిన ప్రజాదరణ, ఆ తర్వాత రచితా రామ్‌ను వెండితెరపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. దర్శన్ నటించిన బుల్బుల్ చిత్రంతో వెండితెరపైకి అరంగేట్రం చేసిన ఆమె, తన మొదటి చిత్రంతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతరువాత అనేక చిత్రాలలో నటించి తనకంటూ తనకంటూ అభిమానులను సంపాదించుకుంది. కాగా రచితా రామ్ 1992, అక్టోబర్ 3న జన్మించారు. ఆమె ఈ రోజున 34వ ఏట అడుగుపెట్టారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.