
Flipkart Big Billion Days Sale 2026 ప్రారంభానికి మరికొన్ని రోజులే ఉంది. ఈ క్రమంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ VIVO తన కంపెనీకి చెందిన అనేక స్మార్ట్ఫోన్లపై ధరలను వెల్లడించింది. ఈ లిస్ట్‌లో బడ్జెట్ ఫోన్ నుండి మిడ్-రేంజ్ సెగ్మెంట్ల వరకు మొబైల్స్ ఉన్నాయి. Vivo T5e అత్యంత తక్కువ ధర కలిగిన మోడల్ కాగా, Vivo T5 ప్రో 5G, Vivo T5 5G వంటి ఫోన్లు కూడా ఈ సేల్ సమయంలో తగ్గింపు ధరలకు లభిస్తాయి. అందువల్ల మీరు ఈ Big Billion Days Sale సమయంలో వివో ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. కింద పేర్కొన్న మోడళ్లపై ఉన్న డీల్స్ గురించి తెలుసుకోండి.
Also Read : అమెజాన్ సేల్‌లో బంపరాఫర్లు.. వీటిపై 80% భారీ డిస్కౌంట్స్.. డోంట్ మిస్..!
Vivo T5x 5G
Flipkart Big Billion Days Sale 2026 సందర్భంగా Vivo T5x 5G భారీ తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. దీనిని కేవలం 24,999 ధరకు కొనుక్కోవచ్చు. ఈ ఫోన్లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.76-అంగుళాల FHD+ LCD డిస్ప్లే ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీని కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ కెమెరాతో పాటు 32MP ఫ్రంట్ కెమెరా కూడా ఉన్నాయి. ఈ ఫోన్ 44W ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,200mAh బ్యాటరీని కలిగి ఉంది.
Vivo T5 pro 5G
Vivo T5pro 5G ధర కూడా తగ్గింది. దీనిని భారీ డిస్కౌంట్‌తో రూ.30,999లకు కొనుక్కోవచ్చు. ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.83-అంగుళాల 1.5K అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 50MP సోనీ IMX882 ప్రధాన కెమెరా, 2MP డెప్త్ కెమెరా, ముందువైపు 32MP కెమెరా ఉంది. ఇందులో 9,020mAh బ్యాటరీ ఉంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
Vivo T5 5G
Vivo T5 5G ఫోన్ కూడా రూ.30,999 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇచ్చే 6.76-అంగుళాల FHD+ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీని కెమెరా సెటప్‌లో 50MP OIS ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇందులో 44W ఫ్లాష్‌ఛార్జ్‌తో కూడిన 7,200mAh బ్యాటరీ ఉంది.
Also Read : కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్
Vivo T4 Lite 5G
బడ్జెట్ విభాగంలో Vivo T4 Lite 5G అందుబాటులో ఉంది. దీనిని భారీ డిస్కౌంట్‌తో కేవలం రూ.15,999 సరసమైన ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ Vivo T4 Lite 5G ఫోన్లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.74-అంగుళాల HD+ LCD డిస్ప్లే ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జి ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP బోకె కెమెరాతో పాటు 5MP ఫ్రంట్ కెమెరా కూడా ఉన్నాయి. ఇందులో 15W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ ఉంది.
Vivo T5e 5G
Flipkart Big Billion Days Sale లో Vivo T5e 5G ఫోన్ చాలా తక్కువ ధరకే లభిస్తుంది. కేవలం రూ.12,999 Vivo T5e 5G ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్లో 5,500mAh బ్యాటరీ ఉంది. IP64 రేటింగ్, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, ఒరిజిన్OS 6 వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.









