
రష్యా, ఉక్రెయిన్ మధ్య మళ్లీ యుద్ధం మొదలవుతోంది. రష్యాని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఉక్రెయిన్ సైన్యం ఒక పెద్ద ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా రష్యా భూభాగంపై రికార్డు స్థాయిలో విరుచుకుపడింది. ఏకంగా 2,000 కంటే ఎక్కువ డ్రోన్లను ఒకేసారి రష్యా మీదికి ప్రయోగించింది. రష్యాకు చెంది ఇంధన వనరులు, ఆయిల్ రిఫైనరీలు, సముద్ర తీరప్రాంత మౌలిక సదుపాయాలను నాశనం చేయడమే లక్ష్యంగా ఈ భారీ దాడి జరిగింది. ముఖ్యంగా రష్యా రాజధాని మాస్కో సమీపంలో ఉన్న ప్రముఖ ఆయిల్ రిఫైనరీలను టార్గెట్ చేస్తూ దాదాపు 650 డ్రోన్లు విరుచుకుపడ్డాయి. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, దట్టమైన పొగ కమ్మేసింది.
Also Read : పక్షవాతానికి చెక్.. బ్రెయిన్ చిప్స్‌కు డెడ్ ఎండ్.. చైనా సైంటిస్టుల అద్భుత ఆవిష్కరణ!
An oil tanker at the Russian Black Sea port of Sochi has reportedly been hit and is now critically on fire. https://t.co/gd53AargTs
— GMI (@Global_Mil_Info) October 6, 2026
ఈ దాడిని తట్టుకునేందుకు రష్యా వైమానిక దళం, గగనతల రక్షణ వ్యవస్థలు వెంటనే అప్రమత్తమయ్యాయి. ఆకాశంలో దూసుకొస్తున్న శత్రు డ్రోన్లను పేల్చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. గగనతలంలోనే సుమారు 900 కి పైగా ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసి పెద్ద విపత్తును నివారించగలిగారు. అయితే ఉక్రెయిన్ పంపిన డ్రోన్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో కొన్ని డ్రోన్లు లక్ష్యాలను తాకాయి. మాస్కో పరిసర ప్రాంతాలు, నల్లసముద్రం తీరంలో ఉన్న కీలక ఇంధన సంస్థలకు భారీగానే నష్టం వాటిల్లింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
అయితే ఈ మొత్తం దాడులు నల్లసముద్ర తీరంలో జరిగింది. అక్కడి సముద్రంలో లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న ఒక భారీ ఆయిల్ ట్యాంకర్‌ను ఉక్రెయిన్ డ్రోన్ నేరుగా వచ్చి ఢీకొట్టింది. దాడి ధాటికి ఆ నౌకలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున పేలుడు జరిగి మంటలు ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో ఓడలో మొత్తం 23 మంది భారతీయ సిబ్బంది విధుల్లో ఉన్నారు. షిప్ నడిసముద్రంలో మంటల్లో చిక్కుకోవడంతో భారతీయుల ప్రాణాలు తీవ్ర ప్రమాదంలో పడ్డాయి. ఈ విషయాన్ని గమనించిన రష్యా ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్స్ క్షణాల్లో రక్షణ చర్యల్లోకి దిగాయి.
ఎంతో కష్టపడి మంటలను అదుపు చేస్తూనే ఓడలో చిక్కుకున్న 23 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసి ఒడ్డుకు చేర్చాయి. భారతీయులంతా క్షేమంగా ఉన్నారని రష్యా అధికారికంగా వెల్లడించింది. ఈ దాడుల తర్వాత రష్యా ప్రభుత్వం మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. రానున్న రోజుల్లో ఉక్రెయిన్ నుంచి డ్రోన్, క్షిపణి దాడులు ఇంకా పెరిగే ప్రమాదం ఉందని రష్యా రక్షణ శాఖ హెచ్చరించింది. రాజధాని మాస్కో ప్రజలతో పాటు తీరప్రాంత పారిశ్రామిక సిబ్బంది నిరంతరం జాగ్రత్తగా ఉండాలని భద్రతా ఆదేశాలు జారీ చేసింది.
Also Read : ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతి.. ఫ్రాన్సిస్ హాల్జెన్‌కు అవార్డు!









