
Airtel : ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. పోస్ట్‌పెయిడ్ టారిఫ్‌లను రూ.50 వరకు పెంచుతూ కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. అయితే ఈ కొత్త ప్లాన్లలో ఏడాదికి ఒకసారి ఉచిత ఇంటర్నేషనల్ రోమింగ్ సదుపాయాన్ని కూడా అందిస్తోంది. కొత్త ప్లాన్లు 2026 అక్టోబర్ 8 నుంచి అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న పోస్ట్‌పెయిడ్ కస్టమర్లను కూడా నెల రోజుల్లోపు వారికి దగ్గరగా ఉన్న తదుపరి అధిక ప్లాన్‌కు మార్చనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఉచిత ఇంటర్నేషనల్ రోమింగ్ ప్రయోజనం విలువ రూ.2,000 ఉంటుందని కంపెనీ అధికారి తెలిపారు. అంటే ప్రస్తుత ప్లాన్లతో పోలిస్తే కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలు రూ.50 పెరగనున్నాయి. కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను మరిన్ని ప్రయోజనాలతో అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అక్టోబర్ 8 నుంచి కస్టమర్లు ప్రతి ఏడాది ఒక అంతర్జాతీయ ప్రయాణంలో ఉచిత రోమింగ్‌ను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న అన్ని ప్రయోజనాలు కూడా కొనసాగుతాయి అని ఎయిర్‌టెల్ తెలిపింది.
Also Read : ఢిల్లీలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. సీమాపురిలో టెన్షన్!
ఉచిత ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్‌లో 5GB డేటా, 60 నిమిషాల కాల్స్, 25 అవుట్‌గోయింగ్ ఎస్‌ఎంఎస్‌లు ఉంటాయి. ఇన్‌కమింగ్ ఎస్‌ఎంఎస్‌లకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఈ ప్యాక్ ఐదు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.
కస్టమర్లు తమకు అవసరమైన సమయంలో ఈ ఉచిత రోమింగ్ ప్యాక్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో ఉన్న ప్రతి సభ్యుడికి కూడా ఈ ఉచిత రోమింగ్ ప్రయోజనం లభిస్తుంది. ఉచిత ఇంటర్నేషనల్ రోమింగ్‌తో పాటు ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో మరిన్ని సదుపాయాలు ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఫాస్ట్ లేన్ టెక్నాలజీ, అన్‌లిమిటెడ్ డేటా, స్పామ్, మోసపూరిత లింకుల నుంచి నెట్‌వర్క్ స్థాయిలో రక్షణ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
అలాగే వివిధ ఎంటర్‌టైన్‌మెంట్ సబ్‌స్క్రిప్షన్లు, ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ అడ్వాంటేజ్ క్లబ్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలకు యాక్సెస్ కూడా కస్టమర్లకు లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులో కామెడీ షోలు, సినిమా ప్రీమియర్లు, మ్యూజిక్ కచేరీలు వంటి కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించింది.
Also Read : కోహ్లీ-అనుష్క ఆ ఆశ్రమానికి వెళ్లేందుకు రూ.5 కోట్లు.. విరాట్ పై సంచలన ఆరోపణలు!









