
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026 (Amazon Great Indian Festival Sale 2026) ఇవాళ అధికారికంగా ప్రారంభమైంది. ఈ సేల్‌లో ఐఫోన్ 16 పై (iPhone 16 Offers) అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. దీంతో ఇటీవల ఐఫోన్ ధరలు విపరీతంగా పెరిగినా.. ఇప్పుడు కూల్‌గా తక్కువ ధరలోనే కొనేయొచ్చు. ఇందులో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
iPhone 16 Offers & Deals
అమెజాన్(Amazon ) సేల్ సమయంలో iPhone 16 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.89,900 ఉండగా.. ఇప్పుడు 14 శాతం తగ్గింపుతో కేవలం రూ76,999కి కొనుక్కోవచ్చు. అంటే iPhone 16 ఫోన్‌పై దాదాపు రూ.13వేల వరకు భారీ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ తగ్గింపులతో దీనిని మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
Also Read : కోహ్లీ-రోహిత్ వీపుపై ఆ డివైజ్ ఏంటి? అసలు సీక్రెట్ ఇదే!
iPhone 16 Specifications
iPhone 16లో 1179×2556 పిక్సెల్స్ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.10-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లే ఉంది. ఇది ఆపిల్ A18 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. iOS 18 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. iPhone 16 దుమ్ము, నీటి నిరోధకత కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi, GPS, NFC, ఒక USB టైప్-C పోర్ట్, 5G ఉన్నాయి. వెనుక కెమెరాలో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.









