
సామాన్య ప్రజలకు మరో బిగ్ షాక్ తగిలింది. నిత్యం ప్రతి ఇంట్లో వినియోగించే వాషింగ్ పౌడర్లు, డిటర్జెంట్ల ధరలు భారీగా పెరిగాయి. ప్రముఖ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMGG) దిగ్గజం హిందూస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ (HUL) తమ బ్రాండ్లైన సర్ఫ్ ఎక్సెల్ (Surf Excel), వీల్ (Wheel), రిన్ (Rin) ధరలను పెంచింది. దీంతో సామాన్యులపై మరింత భారం పడనుంది. వీటి ధరలు ఎంతమేర పెరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ FMGG తయారీ సంస్థ హిందూస్థాన్ యునిలీవర్ లిమిటెడ్.. తమ బ్రాండ్ల రకాన్ని బట్టి 2.2 శాతం నుంచి 7.1 శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ సవరించిన కొత్త ధరలు తక్షణమే అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. దీని ప్రకారం.. ప్యాకింగ్ సైజు ఆధారంగా రూ.2 నుండి రూ.10 వరకు ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిసరుకులు విపరీతంగా పెరగడమే ఈ పెంపుకు గల ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పెంచిన ధరల వివరాలు..
సర్ఫ్ ఎక్సెల్ (Surf Excel):
సర్ఫ్‌ఎక్సెల్ ఈజీ వాష్ 1 kg: పాత ధర రూ.167 ఉండగా.. రూ. 5 పెరిగి కొత్త ధర రూ. 172కి చేరింది.
సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్ 500 గ్రాములు: పాత ధర రూ. 85 నుండి రూ. 87కి పెరిగింది.
సర్ఫ్ ఎక్సెల్ డిటర్జెంట్ బార్ 250 గ్రాములు: పాత ధర రూ. 42 ఉండగా.. కొత్త ధర పెంపుతో ఇప్పుడు రూ. 45 అయింది.
సర్ఫ్ ఎక్సెల్ క్విక్ వాష్ 1కేజీ: పాత ధర రూ. 235 నుండి రూ. 245కి (రూ. 10 పెంపు) చేరింది.
2. రిన్ (Rin):
రిన్ డిటర్జెంట్ పౌడర్ 1kg: పాత ధర రూ. 120 ఉండగా ఇప్పుడు రూ.123కి పెరిగింది.
రిన్ డిటర్జెంట్ పౌడర్ 500 గ్రాములు: పాత ధర రూ. 61 నుంచి రూ.63కి పెరిగింది.
రిన్ అలా 500 గ్రాములు: పాత ధర రూ. 90 ఉండగా.. ఇప్పుడు రూ. 5 పెరిగి కొత్త ధర రూ. 95కి చేరింది.
3. వీల్ (Wheel):
వీల్ పౌడర్ 1 kg: పాత ధర రూ. 90 ఉండగా.. కొత్త ధర రూ. 93కి చేరింది.
వీల్ పౌడర్ 500 గ్రాముల: పాత ధర రూ. 46 నుంచి రూ. 47కి చేరింది.









