
అమెరికా పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుండి ప్రముఖ ఐటీ కంపెనీలపై నిషేధం విధించడాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అలాగే భారతీయ ఉద్యోగులను ఉద్దేశించి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance) చేసిన వ్యాఖ్యలపై న్యూఢిల్లీ మండిపడింది. మైక్రోసాఫ్ట్ సంస్థ అమెరికన్ కార్మికులను తొలగించి వారి స్థానంలో విదేశీ ఉద్యోగులను నియమించుకుంటోందని ఆరోపిస్తూ జేడీ వన్స్ ఆ సంస్థపై PERM ప్రోగ్రామ్‌ను నిలిపివేశారు. మైక్రోసాఫ్ట్ గత ఏడాది 6,000 మంది అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగించిందని.. అదే సమయంలో 6,300 మంది హెచ్-1బీ (H-1B) వీసాదారులు, 3,000 మంది గ్రీన్ కార్డ్ హోల్డర్లను తీసుకుందని జేడీ వాన్స్ అన్నారు.
Also Read : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్.. ఈ భారతీయురాలికి నోబెల్ శాంతి బహుమతి
🇮🇳 US Drains Indian of Top Talent, Then Calls It ‘Indentured Servitude’?
JD Vance’s use of the term has drawn a sharp rebuke from New Delhi, which has called the remark “deeply offensive”. https://t.co/owa40LMtDf pic.twitter.com/qUiKdeEi97
— RT_India (@RT_India_news) October 9, 2026
అంటే తొలగించిన ప్రతి అమెరికన్ స్థానంలో ఒకరి కంటే ఎక్కువ మంది విదేశీ వెట్టిచాకిరీ ఉద్యోగులను నియమించుకున్నారని వన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీ వన్స్ చేసిన ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా పరిశోధన, ఆవిష్కరణలు, ఉత్పాదకత పెంపులో భారతీయ నిపుణులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపింది. ఇరు దేశాల మధ్య ఉన్న ఈ పరస్పర సహకారం వల్ల రెండు దేశాల కంపెనీలకు, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపింది.
ఎన్నో ఏళ్ల నుంచి చూస్తే అమెరికా అభివృద్ధిలో వలసదారుల కృషి ఎంతో ఉందన్న విషయాన్ని గుర్తు చేసింది. అటువంటి నిపుణులను సంబోధించేందుకు పాతకాలపు వలసపాలన నాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసే వెట్టిచాకిరీ వంటి పదాలను ఉపయోగించడం బాధాకరమని, వారి నైపుణ్యాన్ని అవమానించడమేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 52 లక్షల మందికి పైగా భారత సంతతి ప్రజలు నివసిస్తున్నారు. అమెరికన్ల ఉద్యోగ అవకాశాలను విదేశీయులు దక్కించుకుంటున్నారనే నెపంతో మైక్రోసాఫ్ట్‌తో పాటు టాటా, విప్రో, ఇన్ఫోసిస్, అడోబ్, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమిని వంటి ఎనిమిది దిగ్గజ ఐటీ సంస్థలను PERM ప్రోగ్రామ్ నుంచి అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధించింది.
దీనిపై స్పందించిన భారత ప్రభుత్వం.. PERM అనేది గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్‌కు సంబంధించినదని, ఇది నేరుగా హెచ్-1బీ వీసాలకు వర్తించదని తెలిపింది. ప్రస్తుతానికి ఈ నిర్ణయం వల్ల ఉన్న హెచ్-1బీ వీసాల చెల్లుబాటుకు లేదా వారి కుటుంబ సభ్యుల హోదాకు తక్షణ ముప్పు ఏమీ ఉండదని వెల్లడించింది. అయితే ఆయా కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగుల గ్రీన్ కార్డ్ పొందే ప్రక్రియపై మాత్రం ఇది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడింది.
Also Read : H-1B వీసాదారులకు బిగ్ షాక్.. ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం!









