
సీజేపీ పార్టీ అధినేత అభిజీత్ దీప్కే ఢిల్లీలో చేపట్టిన మహా ధర్నా సందర్భంగా ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. ఈ ధర్నా సందర్భంగా బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లిన అభిజీత్ దీప్కేను పోలీసులు ఎయిర్‌పోర్టులో అడ్డుకుని అరెస్టు చేశారు. అలాగే గురుగ్రామ్‌లో ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాథీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతన్ని ఏ కారణంతో అదుపులోకి తీసుకున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది.
Also Read : CJPకి కొత్త నాయకుడు.. అభిజీత్ దీప్కే సంచలన ప్రకటన
Just in
#CJP protests: YouTuber #DhruvRathee detained by Delhi police#breaking #breakingnews #cjp_पार्टी https://t.co/niHxTcIanI
— Karan Singh / करन सिंह (@Journo_Karan) October 10, 2026
ఇటీవల బెంగళూరులో జరిగిన ఎస్ఐఆర్ నిరసన కార్యక్రమంలో ధ్రువ్ రాథీ స్వయంగా పాల్గొన్నారు. అంతేకాకుండా నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరగబోయే భారీ నిరసన ప్రదర్శనలో తాను కూడా పాల్గొంటున్నట్లు శుక్రవారం రాత్రి ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ ద్వారా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా లక్ష్యంగా చేసుకుంటూ.. ప్రజలంతా పెద్ద ఎత్తున జంతర్ మంతర్‌కు తరలివచ్చి ఈ నిరసనలో భాగస్వామ్యం కావాలని ఆయన ఆ వీడియోలో బహిరంగంగా పిలుపునిచ్చారు.
ధ్రువ్ రాథీ సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వ తీరును తరచూ విమర్శిస్తుండటం, అలాగే ఈ తాజా నిరసనల్లో పాల్గొంటానని ప్రకటించడంతోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాటు చేశారు.
Also Read : ఫోన్ సిగ్నల్స్ లేకపోయినా నో ప్రాబ్లమ్.. మస్క్ స్టార్‌లింక్‌తో నెట్వర్క్.. ఎలాగంటే?









