
ప్రస్తుతం డిజిటల్ ఇండియాగా దూసుకుపోతున్న భారత్.. ఇప్పుడు మరో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. సాధారణంగా మనం షాప్‌లలో ఏదైనా వస్తువు కొని దానికి పేమెంట్ చేయాలంటే.. ఫోన్ పే, గూగుల్ పే లేదా పేటెమ్ వంటి యాప్ ఓపెన్ చేసి, లాక్ తీసి, స్కాన్ చేసి పేమెంట్ చేస్తాం. దీనికి చాలా టైం పడుతుంది. కానీ ఇప్పుడు అంత సమయం వృధా కాకుండా.. కేవలం కంటి చూపుతోనే డబ్బులు పంపే అద్భుతమైన ప్రొడెక్ట్ అందుబాటులోకి రాబోతోంది. కేవలం కంటి చూపు, వాయిస్ కమాండ్‌తో క్షణాల్లో డబ్బులు ట్రాన్సఫర్ అయిపోతాయి.
ప్రస్తుతం భారత్‌లో ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026’ అట్టహాసంగా జరుగుతోంది. ఇందులో ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (JIO) అద్భుతమైన, అధునాతన టెక్నాలజీతో కూడిన జియో ఏఐ స్మార్ట్ గ్లాసెస్ (Jio AI Smart Glasses) అనే ప్రొడెక్ట్‌ను ఆవిష్కరించింది. ఈ ఏఐ గ్లాసెస్‌తో కేవలం ఒక క్యూఆర్ కోడ్‌ను చూసి వాయిస్ కమాండ్ ఇస్తే చాలు చెల్లింపు పూర్తవుతుంది.
Also Read : నెట్‌ఫ్లిక్స్‌లో భారీగా ఉద్యోగాల కోత.. 850 మంది ఔట్!
కంపెనీ ఈ కొత్త వేరబుల్ ఎకోసిస్టమ్‌లో కెమెరా గ్లాసెస్, ఆడియో గ్లాసెస్, ఇయర్ఫోన్లతో సహా అనేక ఫీచర్లను అందించింది. ఇవి కేవలం పేమెంట్స్ చేయడమే కాదు.. అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది.
అలాగే లైవ్ ట్రాన్స్లేషన్ చేస్తుంది. అంటే పలు భాషలు మాట్లాడే వారు.. ఒకరి మాటలు ఒకరికి ఈజీగా అర్థం అయ్యేలా రియల్ టైం ట్రాన్స్లేషన్ చేస్తుంది.
ఏఐ నోట్ టేకింగ్ కూడా ఉంది. ఎప్పుడైనా ఇంపార్టెంట్ మీటింగ్స్ లేదా వేరే వారితో మాట్లాడుతున్న సమయంలో కీ పాయింట్స్‌ను ఆటోమేటిగా నోట్ చేస్తుంది.
లైవ్ క్రికెట్ కామెంట్రీ కూడా అందిస్తుంది. మ్యాచ్ జరుగుతున్నపుడు లైవ్ స్కోర్ చెప్పడం, కామెంట్రీ అప్డేట్స్ను అందివ్వడం చేస్తుంది.
అలాగే ఇది ప్రాంతీయ భాషల వాయిస్ కమాండ్స్‌ను కూడా సులభంగా అర్థం చేసుకుని సమాధానిలిస్తుంది.
Also Read : CJP చీఫ్ అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం..









