Gold Price Hike
Gold Price Hike

అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ కారణంగా బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఒక ట్రాయ్ ఔన్స్‌కు ఏకంగా 7,000 నుండి 7,150 డాలర్ల స్థాయికి చేరుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే కనుక జరిగితే దేశంలో10 గ్రాముల బంగారం ధర రాబోయే రోజుల్లో ఏకంగా రూ.2 లక్షల మార్క్‌ను దాటి సుమారు రూ.2.22 లక్షల వరకు చేరుకునే పరిస్థితులు ఏర్పడవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

అయితే మరోవైపు పసిడి ధరల విషయంలో పూర్తిగా వ్యతిరేకమైన అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. కేవలం ధరలు విపరీతంగా పెరుగుతాయని మాత్రమే కాకుండా.. మార్కెట్‌లో ఊహించని భారీ దిద్దుబాటు వచ్చి ధరలు పడిపోయే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఎల్‌బీఎంఏ సర్వేలోని అత్యంత ప్రతికూల లేదా కనిష్ఠ అంచనాల ప్రకారం చూస్తే ఒక ట్రాయ్ ఔన్స్ బంగారం ధర భవిష్యత్తులో 3,450 డాలర్ల స్థాయికి పడిపోయే అవకాశం లేకపోలేదు.

ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, డాలర్ బలపడటం లేదా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ బంగారం కొనుగోళ్ల జోరును తగ్గించుకోవడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటే దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర మళ్లీ రూ.1 లక్ష నుంచి రూ.1.05 లక్షల శ్రేణికి పడిపోయే ప్రమాదం కూడా ఉందని నిపుణులు అంటున్నారు. అయితే ఎప్పటికప్పుడు మారుతున్న ఈ గ్లోబల్ పరిస్థితులను బట్టి బంగారం ధరలు ఎప్పుడైనా కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.