Xiaomi 18 Pro smartphone
Xiaomi 18 Pro smartphone

Xiaomi 18 Pro ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత మార్కెట్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది ముందు, వెనుకవైపు రెండు స్క్రీన్‌లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, రెండు 200MP కెమెరాలు, పెద్ద 7,000mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

Xiaomi 18 Pro features

Xiaomi 18 Pro స్మార్ట్‌ఫోన్‌లో 6.4-అంగుళాల ఫ్లాట్ LTPO AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. దీని గరిష్ట బ్రైట్‌నెస్ 4,000 నిట్స్ వరకు ఉంటుంది. కెమెరా మాడ్యూల్ వద్ద వెనుక భాగంలో 2.7-అంగుళాల LTPO AMOLED రెండవ స్క్రీన్ కూడా ఉంది. ఈ స్క్రీన్ ద్వారా నోటిఫికేషన్‌లను చూడవచ్చు. అంతేకాకుండా ఈ వెనుక స్క్రీన్‌లోని ప్రధాన కెమెరాతో సెల్ఫీలు తీసుకోవచ్చు.

ఈ ఫోన్‌లో సూపర్ పిక్సెల్ డిస్‌ప్లే 2.0 టెక్నాలజీ కూడా ఉంది. Xiaomi 18 Pro.. 2nm టెక్నాలజీతో నిర్మించిన Qualcomm Snapdragon 8 Elite Extreme Gen 6 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 12GB, 16GB RAM వేరియంట్లలో లభిస్తుంది. స్టోరేజ్ ఆప్షన్లలో 256GB, 512GB, 1TB ఉన్నాయి. గేమింగ్, అధిక వినియోగ సమయంలో ఫోన్‌ను చల్లగా ఉంచడానికి ఇందులో కొత్త రింగ్ ఆకారపు కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది.

ఫోటోగ్రఫీ కోసం.. ఈ ఫోన్‌లో 200MP ప్రధాన కెమెరా, 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఈ టెలిఫోటో కెమెరా 3.2x ఆప్టికల్ జూమ్‌కు మద్దతు ఇస్తుంది. దీంతో పాటు 50MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉన్నాయి. ఈ ఫోన్ 7,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 100W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.