
రాజస్థాన్లోని భరత్పూర్ ప్రాంతంలో జరిగిన వివాదం చివరికి ఒక మాజీ ఎమ్మెల్యే ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అతర్ సింగ్ భడానా(Atar Singh Bhadana) పై కొందరు గ్రామస్తులు గుంపుగా వచ్చి విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ దెబ్బలకు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. అయితే మూసేసిన స్టోన్ క్రషర్ ప్లాంట్ను తిరిగి ప్రారంభించాడనే కోపంతో గ్రామస్తులు భడానాను దారుణంగా కొట్టి చంపేశారు.
Also Read : జంతర్ మంతర్ దగ్గర నిరసనలు బ్యాన్.. దీని చరిత్ర ఏంటో తెలుసా?
Jaipur, Rajasthan: Sawai Man Singh Hospital Deputy Superintendent Dr. Pradeep Sharma says, “Late last night, we received information that this incident had occurred with the former MLA. When he arrived at the hospital, he was in critical condition. Our doctors stayed late into the night. The entire trauma team was ready. We made all possible efforts, but we could not save him. Today morning, after conducting the post-mortem, the body was handed over to the family…”
— IANS (@ians_india) October 12, 2026
గత కొంతకాలంగా అత్తర్ సింగ్ భడానా పశువులు మేసే గడ్డి భూములను ఆక్రమించారని, అక్కడ అక్రమంగా మైనింగ్ తవ్వకాలు జరుపుతున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా గతంలో మూతపడిన స్టోన్ క్రషర్ ప్లాంట్ను ఆయన మళ్లీ తెరిచేందుకు ప్రయత్నించడంతో ఊరి జనం ఆగ్రహంతో రగిలిపోయారు. దీనికి నిరసనగా గ్రామస్తులు గత కొద్దిరోజులుగా ప్లాంట్ దగ్గర ధర్నా, ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
Also Read : LOC దాటేందుకు యత్నం.. మందుపాతర పేలి లష్కరే కమాండర్ సహా నలుగురు ఉగ్రవాదులు మృతి
అయితే ఆదివారం రోజున మాజీ ఎమ్మెల్యే అత్తర్ సింగ్ తన అనుచరులతో కలిసి నేరుగా ధర్నా స్థలానికి చేరుకున్నారు. అక్కడ నిరసన తెలుపుతున్న గ్రామస్తులను బలవంతంగా ఖాళీ చేయించి పంపించివేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే వర్గానికి, గ్రామస్తులకు మధ్య మాటమాట పెరిగి పెద్ద గొడవ మొదలైంది. ఊరి జనం ఒక్కసారిగా కోపంతో రగిలిపోయి కర్రలు, రాళ్లతో వారిపై విచక్షణారహితంగా దాడికి దిగారు. ఈ అకస్మాత్తు రక్తపాతంలో మాజీ ఎమ్మెల్యే తీవ్రంగా గాయపడ్డారు.
రక్తపు మడుగులో పడివున్న ఆయనను స్థానికులు, అధికారులు వెంటనే జైపూర్లోని ఎస్.ఎమ్.ఎస్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి కన్నుమూశారు. దాడి జరిగిన వెంటనే పాల్గొన్న గ్రామస్తులు, నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు ఘటనపై తీవ్రస్థాయిలో విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు వేగవంతం చేశాయి.









