Shriya Sharan : నటి జాన్వీ కపూర్‌ నటించిన దేవర: పార్ట్‌ 1 సినిమాలోని ‘చుట్టమల్లె’ పాటకు సంబంధించిన కొన్ని ఫొటోలను AI సాయంతో ఇటీవల మార్ఫింగ్‌ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జాన్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల ఫొటోలను తప్పుగా మార్చడానికి, వారిని అసభ్యంగా చూపించడానికి AIని ఉపయోగించకూడదని ఆమె అన్నారు. ఇప్పుడు దీనిపై సీనియర్ నటి శ్రియా కూడా AIతో మార్ఫింగ్‌ చేసిన ఫొటోల గురించి స్పందించారు. ఇలాంటి ఫొటోలు చూస్తే చాలా ఇబ్బందిగా ఉంటుందని ఆమె చెప్పారు. కొన్ని సందర్భాల్లో ఆ ఫొటోల్లో ఉన్నది తానేనా కాదా అన్నది కూడా తనకు అర్థం కావడం లేదని తెలిపారు.

AIని తప్పుగా ఉపయోగించడం వల్ల ఎక్కువగా మహిళలే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇంటర్నెట్‌లో మహిళల శరీర భాగాల గురించి అసభ్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. “కొన్నిసార్లు ఆ ఫొటోల్లో ఉన్నది నేనేనా కాదా అన్నది కూడా నాకు తెలియదు. కొందరు మీ ఛాతీ పరిమాణాన్ని మార్చేస్తారు. మీరు వేసుకున్న కేప్‌ను తీసేసినట్లు చూపిస్తారు. కొన్నిసార్లు తుంటి భాగాన్ని పెద్దగా చూపిస్తారు. ఇలాంటి వాటిని మీరు మరీ సీరియస్‌గా తీసుకోకూడదు. అయినప్పటికీ, ఇవి చాలా ఇబ్బందికరమైన విషయాలు. ఇలాంటివి చేయడం ఎంతమాత్రం సరైనది కాదు” అని శ్రియా చెప్పారు.

AI వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, అది చాలా విషయాల్లో సహాయపడుతుందని శ్రియా అన్నారు. అయితే, అదే సమయంలో మనకు తెలియకుండానే ఎన్నో మార్పులు చేయగలదని, వాటి వల్ల ప్రమాదాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పారు. ప్రతి టెక్నాలజీతోనూ ఇలాంటి సమస్యలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. కాలం గడిచేకొద్దీ దానితో ఎలా ఉండాలో నేర్చుకోవాలి. లేదంటే దాని వల్ల వచ్చే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలి అని శ్రియా అన్నారు. శ్రియా ప్రస్తుతం దృశ్యం 3లో నటించారు. ఈ సినిమాకు థియేటర్లలో మంచి స్పందన వస్తోంది. బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది ఈ చిత్రం. ఇందులో ఆమె మరోసారి అజయ్‌ దేవగణ్‌ కు భార్య పాత్రలో ఆమె నటించారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.