అమెరికా, మధ్యప్రాచ్య దేశమైన ఇరాన్ మధ్య దౌత్య, సైనిక ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. అమెరికాలో ఇటీవల మధ్యంతర ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగిసిన వెంటనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని సైనిక యంత్రాంగం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులను మరింత వేగవంతం చేసింది. శత్రుదేశాన్ని దారికి తెచ్చుకునేందుకు ఒకవైపు బాంబుల మోత మోగిస్తుండగానే.. మరొకవైపు అంతర్జాతీయ స్థాయిలో ఇరాన్‌ను ఆర్థికంగా, సైనికంగా ఒంటరిని చేసేందుకు అమెరికా అడుగులు వేస్తోంది. అయితే అమెరికా ఎంతటి తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నప్పటికీ.. ఇరాన్ దానికి తగ్గట్లే సరికొత్త వ్యూహాలతో ప్లాన్ చేస్తోంది.

గత కొంతకాలంగా హర్మూజ్ జలసంధితో పాటు ఇరాన్ చుట్టూ ఉన్న కీలకమైన అంతర్జాతీయ జలమార్గాలు, ఓడరేవులపై అమెరికా కఠినమైన సముద్ర ఆంక్షలు, దిగ్బంధనాలను అమలు చేస్తోంది. సముద్ర మార్గం గుండా ఆయుధాలు, ఇంధనం లేదా ఇతర నిషిద్ధ వస్తువుల రాకపోకలను అగ్రరాజ్యం పూర్తిగా నిలిపివేసింది. అయితే ఈ ఆంక్షలను తట్టుకుని తమ సైనిక బలగాలను కాపాడుకునేందుకు విదేశాల నుంచి అక్రమ రవాణాను కొనసాగించేందుకు ఇరాన్ ఒక అనూహ్యమైన నేలమాళిగల వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. శత్రుదేశాల నిఘా విమానాలకు కానీ, వ్యోమనామ శాటిలైట్ కెమెరాలకు కానీ ఏమాత్రం చిక్కకుండా కొండకోనలు, సరిహద్దు ప్రాంతాల కింద విపరీతమైన భూగర్భ మార్గాలను ఆ దేశం నిర్మించింది.

Also Read : ఇజ్రాయెల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఐజెన్‌కోట్ విఫలమైతే నెతన్యాహుకు మళ్లీ పీఠం?

సరిహద్దు దేశాల నుంచి అవసరమైన ఆయుధాలు, విడిభాగాలు, రవాణా సామగ్రిని ఇరాన్ నేతలు ఈ రహస్య సొరంగాల గుండానే తమ భూభాగంలోకి చేరవేస్తున్నట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ సంచలన సమాచారాన్ని వెల్లడించింది. బయట ప్రపంచానికి కనిపించకుండా భూమి పొరల్లో నిర్మించిన ఈ నెట్‌వర్క్ ద్వారానే ఇరాన్ తమ సైనిక బలగాలను పునరుద్ధరించుకోవడమే కాకుండా శత్రు దాడులను ఎదుర్కొనేందుకు ఆయుధ నిల్వలను సమకూర్చుకుంటోందని తెలుస్తోంది.

ఇరాన్ అనుసరిస్తున్న ఈ రహస్య భూగర్భ రవాణాను శాశ్వతంగా కట్టడి చేయడానికి అమెరికా సైనికాధికారులు ఒక భారీ ఆపరేషన్‌కు స్కెచ్ వేశారు. ఈ సీక్రెట్ రూట్లను వెతికి పట్టుకుని పూర్తిగా ధ్వంసం చేసేందుకు ఏకంగా 20 మంది అత్యున్నత నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభించారు. ఫ్లోరిడా కేంద్రంగా పనిచేసే ఈ విభాగానికి క్లిష్టమైన బాధ్యతలను అప్పగించనున్నారు.

ఈ ప్రత్యేక బృందంలో కేవలం ఆర్మీ అధికారులనే కాకుండా, భూగర్భ మార్గాలను డీకోడ్ చేయడంలో నైపుణ్యం కలిగిన సాంకేతిక పౌర నిపుణులను కూడా చేర్చుకోవడం దీని ప్రాధాన్యతను తెలియజేస్తోంది. ఆధునిక మైక్రో-సాటిలైట్లు, జీపీఆర్, పరిజ్ఞానం, అత్యాధునిక సెన్సార్ల సాయంతో ఇరాన్ సరిహద్దుల కింద దాగి ఉన్న ప్రతి చిన్న అండర్‌గ్రౌండ్ మార్గాన్ని మ్యాపింగ్ చేయడమే ఈ టీమ్ ప్రధాన విధులగా నిర్ణయించారు.

Also Read : ఇరాన్‌పై అసలు ఆట ఇప్పుడే మొదలైంది.. ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఓపెన్ వార్నింగ్!