ప్రస్తుతం ఎన్వీడియా పేరు సంచలన రేపుతోంది. ఎన్విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌(Nvidia CEO Jensen Huang) తాజాగా సంచలన విషయం వెల్లడించారు. చైనీస్‌ గూఢచారిగా భావిస్తున్న అలైస్‌ హువాంగ్‌ అలియాస్‌ హువాంగ్‌ లీతో తనకు వివాహేతర సంబంధం ఉందని అంగీకరించారు. దీంతో ఎన్వీడియా పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. అయితే ఎన్వీడియా కంపెనీ ఏం చేస్తుందని ఎక్కువ శాతం మంది సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇంతకీ ఈ కంపెనీ ఏం చేస్తుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

1993లో జెన్సన్ హువాంగ్ అనే నిపుణుడు ఈ ఎన్వీడియాను స్థాపించారు. మొదట్లో కేవలం వీడియో గేమ్‌లు ఆడుకునే వాళ్ల కోసం ‘గ్రాఫిక్స్ కార్డ్స్’ తయారు చేసే చిన్న కంపెనీగా ప్రారంభమైంది. కంప్యూటర్ స్క్రీన్ పైకి వచ్చే గ్రాఫిక్స్, కలర్స్ అద్భుతంగా కనిపించేలా చేయడమే దీని ప్రధాన పనిగా ఉండేది. అయితే కాలక్రమేణా ఆ టెక్నాలజీని మరింతగా అభివృద్ధి చేసి ఇప్పుడు ప్రపంచాన్ని విప్లవాత్మకంగా మార్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి వెన్నెముకగా మారింది. నేడు ప్రపంచంలో ఏఐ టెక్నాలజీ పనిచేయాలన్నా ఎన్వీడియా తయారు చేసే ప్రత్యేకమైన చిప్స్ అత్యంత కీలకంగా మారాయి.

Also Read : ఘోర పడవ ప్రమాదం: 21 మంది వలసదారులు మృతి

సాధారణ కంప్యూటర్లలో ఉండే ప్రాసెసర్లు ఒకసారికి ఒక పనే వేగంగా చేయగలవు. కానీ ఎన్వీడియా తయారు చేసే జీపీయూ చిప్స్ అలా కాదు. ఇవి ఒకే సమయంలో వేలకొద్దీ సంక్లిష్టమైన లెక్కలను, విశ్లేషణలను క్షణాల వ్యవధిలో చేయగలవు. చాట్‌జీపీటీ లాంటి పెద్ద పెద్ద ఏఐ సిస్టమ్‌లకు శిక్షణ ఇవ్వడానికి, కోట్లాది డేటాను క్షణాల్లో ప్రాసెస్ చేయడానికి ఈ చిప్స్ చాలా అవసరం. ప్రపంచంలో ఏఐ మోడళ్లను అభివృద్ధి చేయాలనుకునే ఏ టెక్ కంపెనీ అయినా ఎన్వీడియా చిప్స్ వాడాల్సిందే. అందుకే మార్కెట్లో వీటి కొరత ఏర్పడి డిమాండ్ ఆకాశాన్నంటుతోంది.

ఈ కంపెనీ సంపాదన గురించి వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. కేవలం కొన్ని సంవత్సరాల క్రితంతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఏఐ బూమ్ కారణంగా ఎన్వీడియా ఆదాయం ఊహకందని రీతిలో పెరిగింది. గత కొన్ని త్రైమాసికాల లెక్కల ప్రకారం, ఎన్వీడియా వార్షిక టర్నోవర్ లక్షల కోట్ల రూపాయలు దాటిపోయింది. ఒక్కో త్రైమాసికంలోనే కంపెనీ దాదాపు 30 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. కంపెనీకి వచ్చే ఆదాయంలో దాదాపు 50 నుంచి 60 శాతం వరకు నికర లాభంగానే మిగులుతుంది. ఈ ఆర్థిక విజయాల కారణంగా ఎన్వీడియా మార్కెట్ విలువ ట్రిలియన్ డాలర్లకు చేరి యాపిల్, మైక్రోసాఫ్ట్‌లతో పోటీపడుతూ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల జాబితాలో అగ్రస్థానంలో నిలుస్తోంది. కేవలం ఏఐ చిప్స్ తయారు చేయడంతో ఆగిపోకుండా.. ఎన్వీడియా తన వ్యాపారాన్ని రోబోటిక్స్, సెల్ఫ్-డ్రైవింగ్ కార్లు, హెల్త్‌కేర్, మెడికల్ రీసెర్చ్ వంటి ఇతర అధునాతన రంగాలకు కూడా వేగంగా విస్తరిస్తోంది.

Also Read : ఇరాన్‌పై ట్రంప్ డబుల్ గేమ్.. ఒకవైపు బాంబుల వర్షం.. మరోవైపు రూ.180 కోట్ల బంపర్ ఆఫర్!