Naveen Puligilla :  ఇండియన్ మోటార్ స్పోర్ట్స్ రంగంలో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిన హైదరాబాద్ ర్యాలీ స్టార్ నవీన్ పులిగిల్ల సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్నారు. గురువారం రాత్రి బెంగళూరులో అత్యంత వైభవంగా జరిగిన FMSCI యాన్యువల్ అవార్డ్స్ నైట్ లో 2025 సీజన్‌కు గానూ దేశంలోని బెస్ట్ మోటార్ స్పోర్ట్స్ ఛాంపియన్లను ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా ఘనంగా సత్కరించింది. ఈ ఈవెంట్‌లోనే హైదరాబాద్ ఎస్ నవీన్ పులిగిల్లాకు ప్రతిష్టాత్మక స్పెషల్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అవార్డును అందజేశారు. ఎఫ్‌ఎంఎస్‌సీఐ ఇండియన్ ర్యాలీ కమిషన్ చైర్మన్ విక్కీ చందోక్ ఈ అవార్డును నవీన్‌కు ప్రెజెంట్ చేస్తూ గ్లోబల్ స్టేజ్ పై ఆయన సాధించిన విజయాలను మనస్ఫూర్తిగా అభినందించారు.

కాసరగోడ్‌కు చెందిన సీనియర్ కో-డ్రైవర్ మూసా షెరీఫ్‌తో కలిసి నవీన్ పులిగిల్ల ఇండియన్ మోటార్ స్పోర్ట్స్ హిస్టరీలోనే ఒక అద్భుతాన్ని సాధించారు. అంతర్జాతీయంగా ఎంతో ఫేమస్ అయిన ఎఫ్‌ఐఏ వరల్డ్ ర్యాలీ ఛాంపియన్‌షిప్ (WRC) లో పోడియం ఫినిష్ (టాప్ 3) సాధించిన మొట్టమొదటి ఆల్-ఇండియన్ క్రూ గా వీరు రికార్డు సృష్టించారు. 2025 లో జరిగిన ర్యాలీ సౌదీ అరేబియా WRC3 కేటగిరీలో వీరు సెకండ్ ప్లేస్ కైవసం చేసుకుని సరికొత్త మైలురాయిని అందుకున్నారు. నవీన్ అంతర్జాతీయ ప్రస్థానం ఇక్కడితో ఆగకుండా.. లేటెస్ట్ 2026 సీజన్‌లో కూడా ఐకానిక్ సఫారీ ర్యాలీ కెన్యా WRC3 కేటగిరీలో మరోసారి పోడియం ఎక్కి తన సత్తా చాటారు. దీనివల్ల ప్రపంచ ర్యాలీ రంగాన ఇండియాకు ఒక బ్రైట్ స్టార్‌గా నవీన్ గుర్తింపు తెచ్చుకున్నారు.

నేషనల్ ర్యాలీ ఛాంపియన్ గా

నవీన్‌కు ఈ అవార్డుల పండగ ఇక్కడితో ముగిసిపోలేదు. గ్లోబల్ లెవెల్లో స్పెషల్ అవార్డు అందుకోవడంతో పాటు.. దేశీయంగా జరిగిన INRC 3T కేటగిరీలో నేషనల్ ర్యాలీ ఛాంపియన్ గా కూడా ఆయన కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఇలా ఒకే వేదికపై అటు ఇంటర్నేషనల్ అవార్డు అండ్ ఇటు నేషనల్ ఛాంపియన్ ట్రోఫీ రెండు అందుకోవడంతో నవీన్ పులిగిల్లాకు ఇది ఒక మరపురాని డబుల్ ట్రియంఫ్ గా నిలిచింది. ఈ ట్విన్ హానర్స్ తో భారత మోటార్ స్పోర్ట్స్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మర్‌గా అండ్ గ్లోబల్ స్టేజ్‌పై దేశానికి ఒక గొప్ప అంబాసిడర్‌గా నవీన్ నిలిచారు.

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.