Tulsi Gabbard
Tulsi Gabbard

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ఎక్కడ పుట్టింది? దీని వెనుక ఉన్న అసలు నిజాలేంటి? అనే విషయాలపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చైనాలోని వుహాన్ ల్యాబ్‌లో జరిగిన ప్రమాదకరమైన వైరస్ పరిశోధనల కోసం అమెరికా నుంచే కోట్లాది రూపాయల నిధులు వెళ్లాయని అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసీ గబార్డ్ తన చివరి రోజున ఈ విషయాలను బయటపెట్టారు.

ఈ మొత్తం కుట్రకు అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ముఖ్య వైద్య సలహాదారుగా పనిచేసిన ఆంథోనీ ఫౌచీ సూత్రధారి అని తులసీ గబార్డ్ సంచలన పత్రాలను విడుదల చేశారు. ఫౌచీ దాదాపు 38 సంవత్సరాల పాటు అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ అధిపతిగా చేశారు. వుహాన్ ల్యాబ్‌లో కరోనా వైరస్‌లపై జరిగిన ప్రమాదకరమైన పరిశోధనలకు అమెరికా నిధులు సమకూర్చడంలో ఫౌచీకి పూర్తి ప్రమేయం ఉందని ఆమె స్పష్టం చేశారు. అంతేకాకుండా.. కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో చైనా నిఘా అధికారులతో ఫౌచీ రహస్యంగా మాట్లాడిన ఫోన్ సంభాషణల సమాచారం కూడా తమ వద్ద ఉందని గబార్డ్ ప్రకటించారు.

తులసీ గబార్డ్ జరిపిన దర్యాప్తులో అమెరికా ప్రభుత్వం కేవలం చైనాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో ఉన్న 120 కి పైగా జీవ ప్రయోగశాలలకు చాలా కాలంగా భారీగా నిధులు ఇస్తోందని తేలింది. గబ్బిలాల్లో ఉండే కరోనా వైరస్‌ల శక్తిని మరింత పెంచి.. అవి మనుషులకు వేగంగా సోకేలా చేసే అత్యంత ప్రమాదకరమైన గెయిన్-ఆఫ్-ఫంక్షన్‌ ప్రయోగాల కోసం ఫౌచీ అమెరికా ప్రజల పన్ను డబ్బును రూ.కోట్లలో చైనాకు అక్రమంగా బదిలీ చేశారని ఆ పత్రాల్లో స్పష్టంగా ఉంది. అయితే 2020లో అమెరికాలో కరోనా వైరస్ తీవ్రమైనప్పటి నుంచి ఆ మహమ్మారిపై ప్రభుత్వ విధానాలన్నింటినీ ఫౌచీనే ముందుండి నడిపించినట్లు సమాచారం. చైనాలోని వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ నుంచే ఈ వైరస్ లీక్ అయిందనే నిజం కూడా బయటకు రాకుండా ఆయన చాలా జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది. అమెరికా ఇంటెలిజెన్స్ విభాగంలోని కొందరు అధికారులను తన చేతుల్లోకి తీసుకుని.. కరోనా అనేది ల్యాబ్‌లో పుట్టింది కాదు.. ఇది జంతువుల ద్వారా సహజంగానే మనుషులకు వ్యాపించిందంటూ ప్రపంచవ్యాప్తంగా అబద్ధపు ప్రచారాన్ని చేయించారని తులసీ గబార్డ్ ఆధారాలతో సహా బయటపెట్టారు. ప్రస్తుతం ఇది ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.