
BIG BREAKING : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును నియమించింది. ప్రస్తుతం రాష్ట్ర సీఎస్‌గా సేవలందిస్తున్న కె. రామకృష్ణా రావు పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్ గా సంజయ్ జాజును ఎంపిక చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర సర్వీసుల్లో ఆయన ఇటీవల రిలీవ్ అయ్యారు.
తెలంగాణకు కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు నియామకం
తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
The Telangana Government has issued orders appointing Sanjay Jaju as the new Chief Secretary of the state.#Telangana #SanjayJaju pic.twitter.com/WdVWb6nldt
— Congress for Telangana (@Congress4TS) June 26, 2026
1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సంజయ్ జాజుకు పాలనాపరంగా చాల మంచి అనుభవం ఉంది. గతంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ సబ్‌కలెక్టర్‌గా, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా తన ముద్ర వేశారు. ఆ తర్వాత GHMC అడిషనల్ కమిషనర్‌గా, కమిషనర్‌గా కూడా పనిచేశారు. అలాగే పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు. 2014 నుంచి ఆయన కేంద్ర సర్వీసుల్లో డెప్యుటేషన్‌పై ఉంటూ వివిధ కీలక శాఖల్లో సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు.
కొత్త సీఎస్‌గా ఎవరిని పెట్టాలనే దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగానే కసరత్తు చేశారు. ఈ రేసులో సంజయ్ జాజుతో పాటు మరో సీనియర్ అధికారి జయేష్ రంజన్ పేరు కూడా బలంగా వినిపించింది. అయితే, రాబోయే రోజుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను, పాలనను మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సంజయ్ జాజు అయితేనే కరెక్ట్ అని భావించిన సీఎం రేవంత్ రెడ్డి.. చివరికి ఆయన వైపే మొగ్గు చూపారు. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో సంజయ్ జాజును కొత్త సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 2029 ఫిబ్రవరి వరకు సర్వీసులో ఉంటారు.









